Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాల పోటీ తప్పదా..

By:  Tupaki Desk   |   21 Nov 2017 10:37 AM GMT
ఆ రెండు సినిమాల పోటీ తప్పదా..
X
టాలీవుడ్ స్టార్ హీరోలలో నాగార్జున ఒకరని అందరికి తెలిసిందే. అయితే నాగ్ ప్రస్తుతం తన సినిమాల కన్నా కొడుకు సినిమాల కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఎవ్వరైనా సరే మొదటి సినిమా వరకు సలహా ఇస్తారు. వారి కోసం జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ నాగ్ కొడుకుల మొదటి సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి అనేలా టెన్షన్ తనపై వేసుకుంటున్నాడు.

ప్రస్తుతం నాగ్ ద్రుష్టి మొత్తం అఖిల్ ‘హలో’ సినిమాపైనే ఉంది. ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఏ పని పెట్టుకోకూడదు అని అనుకుంటున్నాడు. అంతే కాకుండా ఏ సినిమా రిలీజ్ కానీ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నాడు. కానీ అదే టైమ్ కి నాని సినిమా కాస్త కలవరపెడుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో నాని ఎంసీఏ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను దిల్ రాజు డిసెంబర్ లోనే రిలీజ్ చెయ్యాలని చూస్తున్నాడు. హలో సినిమా కరెక్ట్ గా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇక దిల్ రాజు MCAను మొదట డిసెంబర్ 15న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండడంతో అఖిల్ తో పోటీ పడకతప్పదేమో అనిపిస్తోంది. సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.

అప్పుడు రిలీజ్ అయితే హలోకి కొంచెం ఎఫెక్ట్ పడక తప్పదు. దీంతో నాగ్ కూడా కొంచెం అసంతృప్తి చెందే అవకాశం ఉంది. దిల్ రాజు మాత్రం ఆ టైమ్ కి రిలీజ్ చేయకుడదనే అనుకుంటున్నాడట. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని బట్టి బయ్యర్స్ రెడీగా ఉంటే మంచిదని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడని తెలుస్తోంది. ఒకవేళ పోటీ పడితే ఎవరు ఎక్కువ కలెక్షన్స్ ని అందుకుంటారో చూడాలి.