Begin typing your search above and press return to search.

అఖిల్ ను ఇబ్బంది పెట్టిన ఆది

By:  Tupaki Desk   |   21 Jan 2019 8:22 AM GMT
అఖిల్ ను ఇబ్బంది పెట్టిన ఆది
X
అఖిల్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'మిస్టర్‌ మజ్ను' చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక తాజాగా జరిగింది. ఆ వేడుకలో హైపర్‌ ఆది స్పీచ్‌ అందరిని ఆకట్టుకుంది. జబర్దస్త్‌ కమెడియన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకుని, పంచ్‌ లతో కామెడీ పండించే సత్తా ఉన్న ఆది ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అఖిల్‌ తో సినిమా షూటింగ్‌ సందర్బంగా ఎదురైన అనుభవాలను ఆది పంచుకున్నాడు.

మిస్టర్‌ మజ్నులో అఖిల్‌ ప్లే బాయ్‌ గా కనిపించనున్న విషయం తెల్సిందే. ఆ విషయాన్ని గురించి ఆది మాట్లాడుతూ మీలో ఎంత మంది ప్లే బాయ్స్‌ ఉన్నారంటూ ప్రేక్షకులను ప్రశించాడు. అందరు కూడా ఎవరు లేరని చెప్పడంతో పైకి అరవింద స్వామిలా కనిపించినా లోపల అంతా కూడా నిత్యానంద స్వాములే. మీలో ఎంతో మంది ప్లేబాయ్స్‌ ఉంటారు. ఆ ప్లే బాయ్స్‌ అందరికి బాబాయ్‌ అఖిల్‌ అంటూ ఆది కామెడీగా అఖిల్‌ పై పంచ్‌ వేశాడు. ఆ సమయంలో అఖిల్ నవ్వుతో మొహమాట పది ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది.

ఇక ఈ చిత్రం కోసం విదేశాల్లో షూటింగ్‌ చేశాం. అక్కడ అమ్మాయిలను మేము చూస్తూ ఉండే వాళ్లం. కాని ఆ అమ్మాయిలు మాత్రం అఖిల్‌ ను చూస్తూ ఉండే వారంటే అందరిని నవ్వించాడు. జబర్దస్త్‌ షో కు దూరం అయిన ఆది వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ కమెడియన్‌ అయ్యాడు. ఈ చిత్రం సక్సెస్‌ అయితే ఆదికి మరింతగా అవకాశాలు దక్కనున్నాయి.