Begin typing your search above and press return to search.

పోస్టర్ ఒకటేనా? సినిమా కూడా కాపీనా?

By:  Tupaki Desk   |   1 Sep 2015 7:21 AM GMT
పోస్టర్ ఒకటేనా? సినిమా కూడా కాపీనా?
X
అఖిల్ హీరోగా లాంఛింగ్ మూవీ అఖిల్... ఈ చిత్రానికి మొదటి పోస్టర్ తో విపరీతమైన హైప్ వచ్చింది. చేతిలో ఫైర్ బాల్ తో చెలరేగిపోయాడు అక్కినేని వారసుడు. కానీ ఈ పోస్టర్ ఓ జపాన్ చిత్రానికి కాపీ అనే విషయం తెలిసిపోయింది. ఆరేల్ల క్రితం డ్రాగన్ బాల్ అనే ఓ జపాన్ సినిమా పోస్టర్ దాదాపు ఇలాగే ఉంటుంది. అందులో కేరక్టర్ ని బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తే... ఇక్కడ సైడ్ లుక్స్ ఇచ్చారంతే.

నిజానికి కాపీ కొట్టడం కొత్త కాదు.. అదేం పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు.. నచ్చినదాన్ని ఇన్ స్పిరేషన్ తీసేసుకుంటారంతే. సినిమా ఇండస్ట్రీలో ఇది మరీ జోరుగా ఉంటుంది. హాలీవుడ్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పి... ఇక్కడ మక్కీకి దించేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్ చేసిన వ్యక్తి... రాజమౌళి కొడుకు కావడం విశేషం. తండ్రి పై వచ్చినన్ని కాపీ ఆరోపణలు.. ఇప్పటినుంచే ఇతనిపై వస్తున్నాయి.

ఇప్పుడు వివి వినాయక్ అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న అఖిల్ కోసం.. మొదటి పోస్టరే.. ఇలా కాపీ చేశారని తెలియడంతో విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఈ మూవీ టీజర్ లో చూపించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ చూస్తుంటే... పోస్టర్ ఒకటేనా.. సినిమాని కూడా కాపీ కొట్టేశారా అనుకుంటున్నారు. అదే ఇన్ స్పిరేషన్ తీసుకుని... మొత్తానికి ఎత్తేశారా అని. సరే ఏదేమైనా నేటివిటీ కిక్‌ తో సినిమా ఎలా తీశారనేది కూడా ముఖ్యమే. వెయిట్‌ అండ్‌ సి.