అఖిల్ అలాంటి పాత్రలో కనిపిస్తాడట

Thu Jun 21 2018 10:54:44 GMT+0530 (IST)

టాలీవుడ్ కి సంబంధించినంత వరకు హీరో అంటే మంచి అబ్బాయి. కాసిన్ని కష్టాలు పడినా సరే.. గుడ్ బోయ్ గానే ఉంటాడు. కొన్ని నెగిటివ్ షేడ్స్ ను ఈ మధ్యన హీరో పాత్రకు సెట్ చేస్తున్నా.. ఓవరాల్ గా మంచోడుగానే ఉంటాడన్న మాట. కానీ అక్కినేని యంగ్ హీరో అఖిల్ కొత్త ప్రయోగం చేసేందుకు రెడీ అయిపోతున్నాడు.తొలి చిత్రం అఖిల్ డిజాస్టర్ తో నిరుత్సాహపడ్డ ఈ హీరో.. మలి చిత్రం హలోతో మంచి పేరు తెచ్చుకున్నా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాడు. ఇప్పుడు ఓ ఆరు నెలలు గ్యాప్ తీసుకుని తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరితో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. ఇప్పుడీ సినిమా షూటింగ్ ప్రారంభానికి అన్నీ సిద్ధమయ్యాయి. లండన్ లో మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేయనుండగా.. రెండు నెలల పాటు అక్కడే మకాం వేయనున్నారట యూనిట్. అయితే.. ఈ సినిమాలో అఖిల్ ఓ ప్లేబోయ్ పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. గతంలోను టాలీవుడ్ హీరోలు ఇలాంటి పాత్రలలో కనిపించారు కానీ.. ఇవేమీ జనాలను పెద్దగా మెప్పించలేదు.

కానీ  వెంకీ అట్లూరి చెప్పిన కథ.. ఇచ్చిన నెరేషన్ హీరోను తెగ మెప్పించేశాయట. అందుకే అఖిల్3 ని ఈ కథతోనే ముందుకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కథకు అనుగుణంగానే సినిమాలో మెజారిటీ భాగం లండన్ లోనే ఉంటుందని.. ఆ తర్వాత హైద్రాబాద్ లో కొంత భాగం షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అఖిల్ హీరోగా రూపొందే మూడో చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.