Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్‌: అఖిల్ కన్ఫామ్‌ చేశాడు

By:  Tupaki Desk   |   27 July 2016 12:36 PM GMT
ఎక్స్ క్లూజివ్‌: అఖిల్ కన్ఫామ్‌ చేశాడు
X
ఈ మధ్యన అఖిల్‌ అక్కినేని ప్రేమలో పడ్డాడని.. త్వరలోనే పెళ్ళి చేసుకుంటాడని చాలా వార్తలే వస్తున్నాయి. మరి వాటిపై అఖిల్‌ ఏమంటాడో? ఆ విషయం మనకు తెలియదు కాని.. ఇప్పుడు అఫీషియల్‌ గా తన రెండో సినిమా గురించి కన్ఫర్మేషన్‌ ఇచ్చాడు ఈ కుర్ర హీరో.

తొలి సినిమా 'అఖిల్' దారుణమైన ఫలితం దక్కించుకోవడంతో.. తన రెండో సినిమాను ఓకె చేయడానికి దాదాపు 10 నెలలు పట్టింది. వంశీ పైడిపల్లితో సినిమా అనుకున్నాడు కాని.. అది వర్కవుట్‌ కాకపోవడంతో ఇప్పుడు దర్శకుడు హను రాఘవపూడితో చేస్తున్నాడు. ''చాలా రోజుల నుండి హను రాఘవపూడి డైరక్షన్ లో చేయడం కోసం ఒక స్ర్కిప్టును తీర్చిదిద్దుతున్నాం. ప్రీ ప్రొడక్షన్‌ వర్కు పూర్తయినట్లే. త్వరలోనే షూటింగుకు వెళుతున్నాం. చాలా ఎక్స్ యిటింగ్ గా ఉంది'' అంటూ ట్వీటేసి మరీ తెలియజేశాడు అఖిల్‌.

''మీ అందరితో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కాబట్టి.. ఈ అప్డేట్ ఇవ్వాలని అనిపించింది'' అంటూ కూడా తెలియజేశాడు ఈ కుర్ర హీరో. గతంలో వంశీ పైడిపల్లి సినిమా గురించి కూడా ఇలాగే ప్రకటించాడు కాని అది మెటీరియలైజ్ కాదు. ఈసారి మాత్రం త్వరగా షూటింగ్ మొదలెట్టేస్తాడని ఆశిద్దాం.