ఫ్లైట్ లో బావ బావమరిది సరదాలు

Mon Mar 20 2017 13:13:32 GMT+0530 (IST)

దగ్గుబాటి రానా.. అక్కినేని అఖిల్ వరుసకు బావ బావమరిది అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. కాసింత ఏజ్ గ్యాప్ ఉన్నా.. ఈ రిలేషన్ కారణంగా వీరి మధ్య బోలెడన్ని సరదాలు నడిచేస్తుంటాయి. రీసెంట్ గా అలాంటిదే ఓ సందర్భం ఎదురైంది.

అఖిల్.. రానా కలిసి ఫ్లైట్ లో జర్నీ చేయాల్సి రాగా.. ఫ్లైట్ ఎక్కగానే రానా కునుకు తీసేశాడు. అది కూడా మామూలుగా కాదు..మాంచి గాఢనిద్రలోకి జారుకుని.. పక్కనున్న అఖిల్ పైకి వాలిపోయాడు కూడా. తన వాలిపోతున్న రానాతో అఖిల్ రకరకాలుగా పోజులు ఇచ్చి ఆట పట్టించగా.. వీటన్నిటికీ ఓ హీరోయిన్ తన కెమెరాలో బంధించేసింది. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. రానా నిద్ర.. అఖిల్ ఆటలను తన సెల్ ఫోన్ లో బంధించేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది.

ఇలా ఆటలాడ్డం ఈ హీరోలిద్దరికీ కొత్తేమీ కాదు. గతంలో అఖిల్ పెళ్లి చేసుకోనున్నాడనే న్యూస్ కన్ఫాం అయినపుడు.. ఓ అవార్డ్ ఫంక్షన్ స్టేజ్ పైనే 'నీ వయసెంత అఖిల్.. అప్పుడే పెళ్లి చేసేసుకుంటున్నావ్' అంటూ సరసాలాడాడు రానా. ఇలాంటి సరదాలు ఈ బామ బావరమరిది మధ్య సాధారణమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/