#అఖిల్ 4: ఆ ఇద్దరినీ లైన్లో పెట్టిన గీతా ఆర్ట్స్

Sat Feb 16 2019 22:13:19 GMT+0530 (IST)

మొదటి సినిమా రిలీజ్ కు ముందే క్రేజ్ తెచ్చుకున్న అక్కినేని అఖిల్ మొదటి హిట్ కొసం ఇంతలా ఎదురు చూడాల్సి ఉంటుందని ఎవరూ ఊహించలేదు.  మొదటి...రెండు సినిమాలు అటూ ఇటూ అయినా 'Mr. మజ్ను' సినిమాతో గాడిన పడతాడని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ అది కూడా ఫ్లాపులలిస్టులో చేరిపోయింది.  ఇదిలా ఉంటే ఇక అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్టును గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు.గీతా ఆర్ట్స్ వారి సక్సెస్ రేట్ అందరికీ తెలిసిందే.  ఏ సినిమా అయినా అంతా పక్కాగా ఉంటేగానీ సెట్స్ మీదకు తీసుకెళ్ళరు. అలానే అఖిల్ కోసం కూడా మంచి ప్రాజెక్ట్ సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.  'గీత గోవిందం' తో గీతా ఆర్ట్స్ వారికి బ్లాక్ బస్టర్ అందించిన పరశురామ్ ఇప్పటికే ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేశాడట.  మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ను తయారు చేశాడట.  ఈ రెండు సినిమాలను గీతావారే నిర్మించనున్నారు. ఈ రెండు కథల్లో ఒకదానిని అఖిల్ కోసం సెట్ చేస్తారట.  అఖిల్ త్వరలోనే ఈ రెండు కథలను వింటాడని.. రెండిట్లో అఖిల్ కు నచ్చిన కథను అఖిల్ కోసం లాక్ చేస్తారని సమాచారం.

ఈ సినిమాను కొంచెం తీరిగ్గానే సెట్స్ మీదకు తీసుకెళ్తారట.  ఈ సినిమాకు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ కాబట్టి ఈసారి అఖిల్ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్టే.   త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.   గతంలో అక్కినేని నాగ చైతన్యకు గీతావారు '100% లవ్' లాంటి సూపర్ హిట్ ను అందించిన సంగతి తెలిసిందే. మరి అఖిల్ కూ అలానే హిట్ అందిస్తారేమో వేచి చూడాలి.