అందుకే హీరోయిన్ ను మార్చారట!!

Tue Dec 12 2017 19:35:32 GMT+0530 (IST)

ఒక హీరో తన కొడుకును ఎలాగైనా ఇండస్ట్రీలో గ్రాండ్ గా లాంచ్ చెయ్యాలని చాలా కలలు కంటుంటాడు. మొదటి సినిమా కోసం వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు అనే సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో అంతేకంటే ఎక్కువగా టెన్షన్ కూడా ఉంటుంది. అన్నీ సెట్ అయ్యాయా లేదా? అలాగే ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా? అనే విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఒక్కోసారి ప్లాన్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు.ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని నాగార్జున కూడా తన కుమారుల కోసం ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అందరికి తెలిసిందే. ముఖ్యంగా అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో హలో సినిమాతో మళ్లీ గ్రాండ్ గా రీ లాంచ్ చేస్తున్నామని చెబుతున్నాడు. అయితే మొదట ఈ కథ ఒకే చేసినపుడు నాగ్ హీరోయిన్ గా ఎవరిని సెలక్ట్ చెయ్యాలనే విషయం గురించి చాలా ఆలోచించారట.

అయితే కళ్యాణి ప్రియదర్శిన్ కంటే ముందుగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ని అనుకున్నారట. దాదాపు ఆమెనే ఫిక్స్ చేసి హిందీలో కూడా సినిమాను రిలీజ్ చేస్తే బావుంటుందని ఆలోచించారట. కానీ ఆ తర్వాత ఇప్పుడే బాలీవుడ్ అయితే బావుండదు అని మెల్లగా సౌత్ లోనే కొన్ని మంచి హిట్స్ అందుకున్న తర్వాత మంచి దర్శకుడితో నార్త్ సైడ్ ట్రై చేయించాలని నాగ్ అనుకున్నారట. అందుకే ఆలియాను పక్కనెట్టి కళ్యాణిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే నాగ్ మొదట్లో బాలీవుడ్ సైడ్ ప్రయత్నాలు చేసి అంతగా హిట్స్ అందుకోలేకపోయారు. ఇక ఇప్పుడు అఖిల్ కు ఆ సత్తా ఉందని కొన్నేళ్ల తర్వాత ఆ ప్రయత్నాలు జరగవచ్చు అని తెలుస్తోంది.