హలో.. హాలీవుడ్ టచ్ ఇదే

Tue Dec 12 2017 19:44:46 GMT+0530 (IST)

హలో సినిమాతో ఎలాగైనా మొదటి హిట్ అందుకోవాలని అఖిల్ హలో సినిమా కోసం చాల కష్టపడ్డాడు అని వాళ్లు వీళ్లు చెప్పడమే కానీ డైరెక్ట్ గా ఆడియెన్స్ ఎవరు చూడలేదు. కానీ అఖిల్ ఏ స్థాయిలో కష్టపడ్డాడో చిత్ర యూనిట్ ఒక వీడియో ద్వారా చూపించేసింది. అంతే కాకుండా సినిమాలో యాక్షన్ సీన్స్ తీయాలంటే నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని అని వీడియో ద్వారా చెప్పకనే చెప్పింది. రీసెంట్ గా అఖిల్ హలో సినిమా యొక్క యాక్షన్ మేకింగ్ వీడియో ను చూస్తే మనకే క్లియర్ అర్ధమవుతుంది.మేకింగ్ వీడియో ను చూస్తుంటే సినిమాలో యాక్షన్ సీన్స్ లో అఖిల్ ఇరగదీశాడు అనిపిస్తోంది. అసలైతే హలో సినిమా లవ్ ఎంటర్టైనర్ అయినా కూడా సినిమాలో ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ కి కూడా మంచి టైమ్ లో ఉండేలా కథకు అవసరం అయ్యేట్టు దర్శకుడు విక్రమ్ రాసుకున్నాడట. మేకింగ్ వీడియోను చూస్తుంటే ఇక హాలీవుడ్ రేంజ్ లో తీశారు అనిపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ బాబ్ బ్రౌన్ ఆధ్వర్యంలో.. అఖిల్ స్టంట్స్ చాలా కష్టపడి చేసినట్లు తెలుస్తోంది.

చాలా ఎనర్జీగా పరుగులు పెడుతూ తన స్టైల్ లో కసితీరా నటించాడు. నిర్మాత నాగార్జున కూడా ఏ మాత్రం తగ్గకుండా చాలా కాస్ట్లీగా యాక్షన్ సీన్స్ కోసం ఖర్చు బాగానే పెట్టినట్లు తెలుస్తోంది. మరి సినిమాలో యాక్షన్ సీన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. మొత్తానికి సినిమా అయితే పూర్తయ్యింది. ఫైనల్ గా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.