Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌: అఖిల్ ర‌బ్బ‌రు దేహం

By:  Tupaki Desk   |   18 Oct 2018 5:59 PM GMT
ఫోటో టాక్‌: అఖిల్ ర‌బ్బ‌రు దేహం
X
ఆరుప‌ల‌క‌లు.. ఎనిమిది ప‌ల‌క‌లు ఓ ట్రెండ్. ఆ పిచ్చి ఒక‌సారి స్టార్ట‌యితే అది వ‌ద‌ల‌దు. బైసెప్‌.. ట్రైసెప్‌.. షోల్డ‌ర్ .. 6 ప్యాక్ యాబ్స్! అంటూ టార్గెట్స్ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌స్తుతం అఖిల్ స‌న్నివేశం అదే. శ‌రీరాకృతిని పెర్ఫెక్ట్ గా మ‌లుచుకోవాల‌న్న క‌సితో ర‌గిలిపోతున్నాడు. ఫిజిక‌ల్ ఫిట్ నెస్ విష‌యంలో ఏమాత్రం రాజీకి రావ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే రెగ్యుల‌ర్‌గా ఓ స్పెష‌లిస్ట్ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. హృతిక్ రోష‌న్ స్ఫూర్తి తో గంట‌ల త‌ర‌బ‌డి జిమ్ముల్లోనే కాల‌క్షేపం చేస్తున్నాడు. ప్ర‌తిసారీ సెల్ఫీలు తీసుకుని మేకోవ‌ర్ ఎంతో చెక్ చేసుకుంటున్నాడు.

లుక్ అనేది అనునిత్యం మార్పు చేసుకునే వ్య‌వ‌హారం. సినిమా కథ‌, కంటెంట్ ని బ‌ట్టి రూపం మార్చుకోవాలి. ల‌వ‌ర్‌బోయ్‌కి ఓ రూపం, ఇంజినీర్‌కి ఇంకో రూపం, రోమియోకి వేరొక రూపం .. ఇలా గెట‌ప్స్ ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం చియాన్ `మిస్ట‌ర్ మ‌జ్ను`గా మారాడు. అందుకే రోమియో లుక్‌కి మారాడు. ర‌బ్బ‌రు సాగినంత ఫ్లెక్సిబుల్‌గా దేహాన్ని మ‌లిచాడు. తీరైన రూపంతో మ‌గువ‌ల గుండెల్లో గుబులు రేపుతున్నాడు. శ్ర‌మ‌కు త‌గ్గ‌ట్టే ఫ‌లితం ద‌క్కింది. ప్ర‌స్తుతం అఖిల్ రూపం సంథింగ్ స్పెష‌ల్‌గా క‌నిపిస్తోంది.

ఇదే లుక్‌తో `మిస్ట‌ర్ మ‌జ్ను` సినిమాలో క‌నిపిస్తాడు కాబ‌ట్టి ఆ మేర‌కు స్క్రీన్ ప్రెజెన్స్ మెస్మ‌రైజ్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అఖిల్, హ‌లో చిత్రాల త‌ర్వాత ఈ సినిమాని ఎంతో ఛాలెంజింగ్‌గా చేస్తున్నాడు. లండ‌న్, హైద‌రాబాద్‌లో మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. డిసెంబ‌ర్‌లో రిలీజ్ ఉంటుంద‌ని తొలుత భావించినా, ఆ త‌ర్వాత ల‌వ‌ర్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.