రొమాంటిక్ గా రానున్న ఆకాష్ పూరి

Mon Feb 11 2019 11:01:09 GMT+0530 (IST)

టీనేజ్ లోనే 'ఆంధ్రాపోరి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి  గ్యాప్ తీసుకొని 'మెహబూబా' సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు.   'మెహబూబా' లో తన నటనకుగానూ మంచి మార్కులు తెచ్చుకున్న ఆకాష్ ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టం పరిక్షించుకోబోతున్నాడు.  ఆకాష్ పూరి తాజా చిత్రం 'రొమాంటిక్' ను ఈరోజే లాంచ్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు.  మూవీ లాంచ్ కార్యక్రమానికి సీనియర్ నటి రమాప్రభ కూడా హాజరయ్యారు.  సినిమా లాంచ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని షూటింగ్ మొదలుపెట్టడం అన్నట్టు కాకుండా డైరెక్ట్ గా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు.  పూరి జగన్నాధ్ శిష్యుడు అనిల్ పాడూరి ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.  

ఈ సినిమాకు కథ.. స్క్రీన్ ప్లే.. డైలాగులు పూరి జగన్నాధ్ అందిస్తున్నారు.  టైటిల్ కు తగ్గట్టే బ్యూటిఫుల్ గా రొమాంటిక్ గా సాగే ఈ లవ్ స్టొరీని పూరి జగన్నాధ్.. చార్మీ కౌర్ పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్.. పూరి బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పూరి జగన్నాధ్ సతీమణి లావణ్య సమర్పిస్తున్నారు.