Begin typing your search above and press return to search.

అంబానీ ఇంట పెళ్లి.. సెల‌బ్రిటీలు ఫుల్ బిజీ!

By:  Tupaki Desk   |   23 Feb 2019 4:34 AM GMT
అంబానీ ఇంట పెళ్లి.. సెల‌బ్రిటీలు ఫుల్ బిజీ!
X
ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రు.. భార‌త దేశ అత్యంత సంప‌న్నుడి ఇంట జ‌రుగుతున్న పెళ్లి అంటే మాట‌లా? నింగి.. నేల ఏకం చేసేంత‌లా భారీ ఎత్తున సాగుతున్న ఏర్పాట్ల ముచ్చ‌ట్లు అన్ని ఇన్ని కావు. అప‌ర శ్రీ‌మంతుడి ఇంట జ‌రుగుతున్న పెళ్లికి ఆ ఇంట హ‌డావుడిని ప‌క్క‌న పెడితే.. ప్ర‌ముఖుల్లోనే వీర ప్ర‌ముఖుల‌న్న వారు సైతం అంబానీ ఇంట జ‌రిగే పెళ్లికి.. ఇత‌ర పార్టీల‌కు హాజ‌ర‌య్యేందుకు త‌మ షెడ్యూల్స్ ను స‌రి చేసుకుంటున్నారు.

మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలైతే.. త‌మ షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. మార్చి 9న జ‌రిగే పెళ్లి సంద‌డి ఇప్ప‌టి నుంచే మొద‌లైంది. పెళ్లికి రెండు వారాల ముందు నుంచే అంబానీ ఇంటికి పెళ్లి క‌ళ వ‌చ్చేసింది. పెళ్లికి రెండు వారాల ముందు నుంచే.. సినిమాల్లో చూపించే వాటి కంటే భారీగా వేడుక‌లు షురూ అయ్యాయి.

ఈ వీకెండ్‌లో స్విట్జ‌ర్లాండ్‌ లో జ‌రిగే బ్యాచిల‌ర్ పార్టీ కోసం బాలీవుడ్ ప్ర‌ముఖులు ప‌లువురు ఇప్ప‌టికే స్విస్ బ‌య‌లుదేరి వెళ్లారు. బాలీవుడ్ నుంచి క‌ర‌ణ్ జోహార్.. ర‌ణ్ బీర్ క‌పూర్ లు ఇప్ప‌టికే స్విస్ లో ఉంటే.. గ్లోబ‌ల్ స్టార్ గా మారిన ప్రియాంక ఆమె భ‌ర్త నిక్ లు సైతం బ్యాచిల‌ర్ పార్టీలో భాగ‌స్వామ్యం కానున్నారు.

మొత్తంగా 500 మంది అతిధులు ఈ వేడుక‌కు హాజ‌రుకానున్నారు. మ‌రి.. బ్యాచుల‌ర్ పార్టీకి వేదిక‌గా స్విస్ లోని సెయింట్ మోరిట్జ్ ల‌గ్జ‌రీ హోట‌ల్ మారింది. సెయింట్ మోరిట్జ్ స‌ర‌స్సు ఒడ్డున ఉండే ఈ హోట‌ల్ విలాస కార్య‌క్ర‌మాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చెబుతుంటారు. ఈ హోట‌ల్లో చాలా చౌకైన రూమ్ అద్దె రోజుకు జ‌స్ట్ ల‌క్ష రూపాయిలు మాత్ర‌మే. ఈ ఒక్క‌టి చాలు.. ఈ హోట‌ల్ ఎంత ఖ‌రీదైన‌దో చెప్ప‌టానికి.

బ్యాచిల‌ర్ పార్టీ కోసం అంబానీలు బుక్ చేసిన రూమ్ ఒక్కొక్క దాని ధ‌ర రోజుకు రూ.3.80 ల‌క్ష‌లుగా చెబుతున్నారు. పార్టీకి వ‌చ్చిన వారి కోసం ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను చేశారు. స‌ర‌స్సు ఒడ్డున ఉన్న పార్క్ ల‌ను చూపించ‌టం కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు.. ప్ర‌ఖ్యాత డ్రోన్ షోల‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం స్టార్ట్ అయ్యే వేడుక‌లు అర్థ‌రాత్రి వ‌ర‌కూ సాగి.. రెండో రోజు వేడుక‌లు సోమవారం మ‌ధ్యాహ్నం షురూ కానున్నాయి. హోట‌ల్లో అతిధుల‌కు ఏర్పాటు చేస్తున్న ఒక్కో రూమ్ అద్దె రూ.3.8ల‌క్ష‌ల చొప్పున ఉంటే.. ఇక మిగిలిన ఖ‌ర్చుల లెక్క ఎంత భారీగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.