Begin typing your search above and press return to search.

దేవదాస్ భామలు అదరహో..

By:  Tupaki Desk   |   17 Sep 2018 9:09 AM GMT
దేవదాస్ భామలు అదరహో..
X
టాలీవుడ్లో తర్వాతి పెద్ద సినిమా ‘దేవదాస్’. అక్కినేని నాగార్జున-నానిల క్రేజీ కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అగ్ర నిర్మాత అశ్వినీదత్.. నిర్మాణంలో యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్.. టీజర్ లతో పాటు ఇప్పటిదాకా రిలీజ్ చేసిన రెండు పాటలూ ఆకట్టుకున్నాయి. అన్నింట్లోనూ ఒక పాజిటివ్ ఫీల్ కనిపిస్తోంది. ఐతే ఇప్పటిదాకా ప్రతి ప్రోమోలోనూ ప్రధానంగా హీరోల సందడే కనిపిస్తోంది.

‘వారు వీరు’ పాటలో మాత్రం హీరోయిన్లు రష్మిక మందాన్నా.. ఆకాంక్ష సింగ్ తళుక్కుమన్నారు. ఐతే సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్లిద్దరి ఫస్ట్ లుక్స్ లాంచ్ చేశారు. ఈ సినిమాలో రష్మిక పూజ పాత్రలో కనిపించనుండగా.. ఆకాంక్ష జాహ్నవిగా కనిపించనుంది. ఈ ఫస్ట్ లుక్స్ లో ఇద్దరూ చాలా అందంగా.. ఆకర్షణీయంగా ఉన్నారు. పోస్టర్ల డిజైనింగ్ కూడా చాలా బాగుంది. రష్మిక మోడర్న్ ఔట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తుంటే ఉంటే.. ఆకాంక్ష చీరలో మెరిసి పోతోంది.

‘దేవదాస్’కు నాగ్-నానిలే కాదు హీరోయిన్లు కూడా ప్రత్యేక ఆకర్షణే. రష్మిక.. ఆకాంక్షల గత సినిమాలు వీరికి చాలా మంచి పేరు తెచ్చాయి. ‘ఛలో’.. ‘గీత గోవిందం’ చిత్రాలతో రష్మిక స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. అందులోనూ ‘గీత గోవిందం’ తర్వాత తన రేంజే మారిపోయింది. ఇక ఆకాంక్ష తన తొలి సినిమా ‘మళ్ళీ రావా’లో బలమైన ముద్ర వేసింది. అందం.. అభినయంతో ఆకట్టుకుంది. మరి వీళ్లిదరూ కలిసి ‘దేవదాస్’లో ఎలా కనిపిస్తారో.. ఎలా పెర్ఫామ్ చేస్తారో.. సినిమాకు ఎంత ప్లస్ అవుతారో చూడాలి.