Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో సినిమా.. విశ్వాసం

By:  Tupaki Desk   |   23 Nov 2017 4:27 PM GMT
ఆ స్టార్ హీరో సినిమా.. విశ్వాసం
X
వీరం.. వేదాలం.. వివేగం.. తమిళ స్టార్ అజిత్ కుమార్.. డైరెక్టర్ శివ కాంబినేషన్లో సినిమాల జాబితా ఇది. వీళ్ల కాంబోలో వచ్చిన తొలి సినిమా ‘వీరం’ విజయవంతం కావడంతో ఆ తర్వాత రెండు సినిమాలకు కూడా సెంటిమెంటుగా ‘వి’ అనే అక్షరంతోనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు ఈ కలయికలో రాబోతున్న నాలుగో సినిమాకు కూడా సెంటిమెంటును కొనసాగించబోతున్నారు. వీరి కొత్త సినిమాకు ‘విశ్వాసం’ అనే టైటిల్ ఖరారు చేయడం విశేషం. ఇంకా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే టైటిల్ మాత్రం ఖాయమైపోయింది.

అజిత్-శి కాంబినేషన్లో వచ్చిన తొలి రెండు సినిమాలు పెద్ద హిట్టే అయ్యాయి కానీ.. మూడో సినిమా ‘వివేగం’ మాత్రం తుస్సుమంది. భారీ అంచనాల మధ్య ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. అయినప్పటికీ అజిత్.. మళ్లీ శివతోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అతడి చివరి నాలుగు సిినిమాల్లో మూడు శివతో చేసినవే. ఇప్పుడు వరుసగా అతడితో మూడో సినిమా చేస్తున్నాడు అజిత్. దాన్ని బట్టే అతడి మీద అజిత్ కు ఎంత గురో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు టైటిళ్ల సంగతేమో కానీ.. ‘విశ్వాసం’ అనే పేరు చూస్తే మాత్రం సెంటిమెంటు కోసం పట్టుబట్టి పెట్టినట్లుగా ఉంది. ఇది సినిమా టైటిల్ లాగా లేదు. ఇందులో క్యాచీనెస్ ఏమీ కనిపించట్లేదు. మరి ఈ టైటిల్ పెట్టి ఏం సినిమా తీస్తారో చూడాలి. ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు.