అక్కడ సంక్రాంతి విజేత డిసైడ్

Sat Jan 12 2019 16:25:32 GMT+0530 (IST)

సంక్రాంతి అనగానే తెలుగుతో పాటు తమిళనాట కూడా భారీ చిత్రాలు క్యూ కడతాయి. తెలుగులో ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అదృష్టం కొద్ది నాలుగు సినిమాలు కూడా నాలుగు రోజుల్లో ఒకదారి తర్వాత ఒకటి విడుదల అవుతూ వచ్చాయి. నాలుగు సినిమాల్లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మొదటగా వచ్చి మంచి మార్కులు కొట్టేసింది. పేటకు పెద్దగా ఆధరణ దక్కలేదు. వినయ విధేయ రామ చిత్రం ఫ్లాప్ అయినట్లే ఇక ఎఫ్ 2 మాత్రం ఫ్యామిలీస్ ను ఆకట్టుకునేలా ఎంటర్ టైన్ మెంట్‌తో సాగింది. టాలీవుడ్ లో సంక్రాంతి విజేత ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే తమిళనాట సంక్రాంతి విజేతపై క్లారిటీ వచ్చేసింది.సంక్రాంతికి తమిళనాట రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు కూడా ఢీ అంటే ఢీ అంటూ ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. తమిళనాట స్టార్ హీరోలైన అజిత్ మరియు రజినీకాంత్ లు సంక్రాంతికి ఢీ కొట్టిన నేపథ్యంలో పైచేయి ఎవరిదా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. రెండు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ వచ్చి రెండు సినిమాలు కూడా భారీగా వసూళ్లు రాబడుతున్నాయి.

తమిళనాడుతో పాటు బయట కూడా రెండు సినిమాలు బాగానే రాబడుతున్నాయి. అయితే ఓవర్సీస్ తో పాటు ఇతర ప్రాంతాల్లో అజిత్ కంటే కాస్త ఎక్కువ రజినీకాంత్ కు క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కారణంగా 'విశ్వాసం'తో పోల్చితే 'పేట'కు కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. 'పేట' కలెక్షన్స్ విషయంలో ముందంజలో ఉంది. రెండు సినిమాల మద్య కాస్త గ్యాప్ ఉన్నా కూడా పేట ముందు ఉండటంతో రజినీకాంత్ అభిమానలు సంక్రాంతి విజేత సూపర్ స్టార్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మరో వైపు అజిత్ ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంగానే ఉన్నారు.