తలైవాను ను దాటేసినా తల!

Fri Jan 11 2019 16:18:12 GMT+0530 (IST)

తెలుగులో సంక్రాంతి పోటీలాగానే తమిళంలో పొంగల్ సీజన్లో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డాయి. రజనీకాంత్ 'పెట్టా'(తెలుగులో 'పేట').. అజిత్ కుమార్ 'విశ్వాసం' ఒకేరోజున పోటాపోటీగా విడుదలయ్యాయి.  పండగ సీజన్లో భారీ ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరోల సినిమాలు కావడంతో తమిళ నాడులోని అన్ని సినిమా థియేటర్ల వద్ద సందడి నెలకొంది.రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తోనే ఓపెన్ అయ్యాయిగానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం అజిత్ సినిమా 'విశ్వాసం' జోరుగా ఉంది.  'విశ్వాసం' మొదటి
రోజున రూ. 26 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.  దర్శకుడు శివ మాస్ ఆడియన్స్ ను మెప్పించడంతో సూపర్ హిట్ గా నిలవడం ఖాయమని అంటున్నారు.  శివ-అజిత్ కాంబినేషన్లో 'వీరం'.. 'వేదాళం' లాంటి సూపర్ హిట్లు తెరకెక్కాయి. వారి కాంబినేషన్లో వచ్చిన లాస్ట్ సినిమా 'వివేగం' మిక్స్డ్ టాక్ తో కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక తాజా చిత్రం 'విశ్వాసం' కూడా భారీ రెస్పాన్స్ తో రజనీ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం. 

ఇప్పటికే తమిళనాడు బాక్స్ ఆఫీసు రికార్డులు దాదాపుగా విజయ్ పేరు మీద ఉండడంతో రజనీకాంత్ మార్కెట్ తగ్గిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ కు సమఉజ్జీగా భావించే అజిత్ తో పోటీలో నెగ్గగలడా..  'పెట్టా' తో అజిత్ సినిమాకంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించగలడా లేదా అని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఈ పోటీలో అజిత్ దే పైచేయిగా నిలిచింది.  అజిత్ సరసన నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  డీ. ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.