Begin typing your search above and press return to search.

బాహుబలిలో బందిపోటు వీరయ్య ఇతడే

By:  Tupaki Desk   |   8 Feb 2016 7:54 AM GMT
బాహుబలిలో బందిపోటు వీరయ్య ఇతడే
X
బాహుబలి షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆ మూవీ షూటింగ్ కి సంబంధించిన అప్ డేట్స్ ఏమీ బైటకు రాలేదు. సినిమా రిలీజ్ కు ముందు రాజమౌళి పాత్రలను పరిచయం చేసినపుడే ఒక్కో విషయం జనాలకు తెలిసింది. ఇది బాహుబలి ది బిగినింగ్ కు జక్కన్న ఫాలో అయిన స్ట్రాటజీ. ఇప్పుడు మరి పద్ధతి మార్చాడో.. లేక అజయ్ ఘోష్ అనుకోకుండా చెప్పేశాడో కానీ.. బాహుబలికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు బైటకు చెప్పేశాడు.

తన పాత్ర గురించి డీటైల్డ్ గా చెప్పేశాడు విశారణై విలన్. రీసెంట్ గా విడుదలైన తమిళ మూవీ విశారణైలో శాడిస్ట్ పోలీస్ పాత్రతో అలరించిన అజయ్ ఘోష్.. ఇప్పుడు అందరితోనూ ప్రశంసలు పొందుతున్నాడు. ఇంత క్రూరంగా చేయాల్సి రావడంతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట. ఈ మూవీ చూసినోళ్లందరూ తనని ద్వేషిస్తారని అనుకున్నానని.. అంత నేచురల్ గా సినిమా వచ్చిందన్న అజయ్.. బాహుబలికి సంబంధించిన కొన్ని కీలక విషయాయలు కూడా చెప్పేశాడు.

'బాహుబలి ది కంక్లూజన్ లో నేను బందిపోటు వీరయ్య పాత్ర పోషిస్తున్నాను. అనుష్క పాలించే రాజ్యంలో ఇతను ఉంటాడు. ఇప్పటికే కేరళలో ఐదు రోజుల షూటింగ్ పూర్తి కాగా.. మళ్లీ మార్చిలో నా పాత్రకు సంబంధించిన మిగిలిన పార్ట్ పూర్తి చేయాల్సి ఉంది' అంటూ చెప్పాడు అజయ్ ఘోష్. మరి ఇలా ఓ రోల్ గురించి, అనుష్క రాజ్యం గురించి తనే చెప్పేశాడో, లేక రాజమౌళి చెప్పమన్నాడో కానీ.. ఇప్పుడు బాహుబలికి సంబంధించిన కొత్త అప్ డేట్ తో.. ఫ్యాన్స్ లో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది .