Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ ఫ్యామిలీ పవర్ స్టార్ తో...

By:  Tupaki Desk   |   19 Oct 2016 11:28 AM GMT
ఫ్యామిలీ ఫ్యామిలీ పవర్ స్టార్ తో...
X
మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు.. ఎందుకోగాని ''కాటమరాయుడు'' షూటింగ్ స్పాటులో పవన్ కళ్యాణ్‌ తాను రెగ్యలుర్ గా పెట్టే రూల్స్ అన్నింటికీ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఈసారి మనోడు సెట్లో ఎవరొచ్చి తనతో ఫోటోలు దిగుతాను అన్నా కూడా.. వెంటనే వారితో ఫోటోలు దిగేస్తున్నాడు. రోజూ షూటింగ్ కంటే ఈ ఫోటోల సందడే ఎక్కువగా ఉందేమో అనే సందేహం వచ్చే రేంజులో ఫోటోలు దిగుతున్నాడులే.

మొన్ననే హీరో శివబాలాజీ ఏకంగా ఫ్యామిలీతో వచ్చి తన బర్తడేను పవన్ కళ్యాణ్‌ ముందు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తరువాత అనేకమంది యాక్టర్లు రోజూ వారివారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్‌ ఫోటోలు దిగుతున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు నటుడు అజయ్ కూడా తన వైఫ్‌ అండ్ కొడుకును తీసుకొచ్చి అక్కడే ఫోటోలు దిగాడు. మొత్తానికి పవన్ తో ఇలా ఫ్యామిలీలు ఫ్యామిలీలు ఫోటోలు దిగడం చాలా కొత్తగానే ఉంది.

ఇకపోతే కాటమరాయుడు షూటింగుకు ఏమాత్రం అంతరాయం రాకుండా ఈ ఫోటోలన్నీ దిగుతున్నారంటలే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ సినిమాలో తనకు తమ్ముళ్ళ పాత్రలను చేస్తున్న అజయ్ - శివ బాలాజీ - సాందీప్ వంటి నటులతో కలసి.. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ టాకీ పార్టును పూర్తి చేస్తున్నాడు. ఈ షూటింగులో శృతి హాసన్ కూడా నిన్నటివరకు పాల్గొని వెళ్ళిందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/