Begin typing your search above and press return to search.

ఆ యుద్ధం మీద సినిమా.. వావ్ కేక

By:  Tupaki Desk   |   30 July 2016 4:13 AM GMT
ఆ యుద్ధం మీద సినిమా.. వావ్ కేక
X
బాలీవుడ్ లో ఈ మధ్యన... రియల్ గా జరిగిన ఉదంతాలను తీసుకుని సినిమాలు తీయడానికి స్టార్ హీరోలు మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం శివాయ్ చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసిన అజయ్ దేవగన్.. తర్వాత చేయబోయే సినిమా.. ఒక భీకర యుద్దానికి సంబంధించిన కథ. ''సన్స్ ఆఫ్ సర్దార్- బ్యాటిల్ ఆఫ్‌ సారాగరి'' పేరుతో తీయనున్న ఈ మూవీకి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేయడంతో.. ఇప్పుడా ఈ యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ మూవీ 300 ని చూసి అబ్బో అనుకుంటాం. ఈ బ్యాటిల్ ఆఫ్ సారాగరి అందుకు ఏ మాత్రం తీసిపోదు.

సారాగరి యుద్ధం.. 19వ శతాబ్దం చివర్లో జరిగిన ఈ యుద్ధానికి చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. 1897లో సెప్టెంబర్ 12న యుద్ధం జరిగితే.. ఇప్పటికీ సెప్టెంబర్ 12ను సారాగరి దినంగా జరుపుకుంటారంటే.. ఆ యుద్ధం గొప్పతనం అర్ధమవుతుంది. బ్రిటీష్‌ ఇండియా.. ఆఫ్గాన్ సరిహద్దులోని ఓ చిన్న గ్రామం సారాగరి. ఇప్పుడు అది పాకిస్తాన్‌ లో బలోచిస్తాన్ ప్రాంతంలో ఉందిలే. అక్కడ ఉన్న కోటలో కేవలం 21 మంది సిక్కుల ఉన్న ఓ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ దళం మాత్రమే ఉన్న సమయం అది. వారిపై 10వేల మంది ఆఫ్ఘన్ సైనికులు దండెత్తారు. ఆ సమయంలో యుద్ధానికే మొగ్గాడు కల్నల్ గురుముఖ్ సింగ్. 10 వేల మందితో 21 మంది యుద్ధం.. ఊహించుకోవడానికే భయం వేసినా అదే జరిగింది. లొంగమంటే లొంగకుండా.. కోటలోకి రాకుండా అడ్డుకున్నారు. రాత్రి వరకూ జరిగిన యుద్ధంలో చివరకు కోటను దక్కించుకుంటారు ఆఫ్ఘన్లు. ఆ 21 మందీ పోరాడి ప్రాణాలు వదిలేశారు.

కాని విశేషం ఏంటంటే.. చనిపోయేలోపు దాదాపు 180 మంది శత్రు సైనికులను వారు చంపేశారు. అప్పట్లో అనఫీషియల్ లెక్కల ప్రకారం.. తరువాత ఆఫ్గన్ సేనలపై మరో బ్రిటిష్ దళం వచ్చి యుద్దం చేసి గెలిచాక.. దాదాపు 5000 మంది చనిపోయారట. అందుకే ఆ యుద్ధానికి అంత పేరొచ్చింది. ఇప్పుడా యుద్ధంపై సినిమా అంటే క్రేజ్ ఏర్పడింది. అజయ్ దేవగన్ ఈ యుద్ధంపై.. సన్స్ ఆఫ్ సర్దార్ సినిమా తీయాలనే ఆలోచనతోనే సగం సక్సెస్ సాధించేశాడు.