Begin typing your search above and press return to search.

భారతీయుడు 2లో ఆ హీరో

By:  Tupaki Desk   |   21 Feb 2018 10:27 AM GMT
భారతీయుడు 2లో ఆ హీరో
X
కమల్ హాసన్ అద్వితీయ నటనకు మాస్టర్ డైరెక్టర్ శంకర్ పనితనానికి నిదర్శనంగా నిలిచిన భారతీయుడు సినిమా సృష్టించిన చరిత్ర మర్చిపోవడం సులభం కాదు. లంచాలు అడిగే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపి పారేసే వయసు మళ్ళిన సేనాపతి పాత్రలో కమల్ పెర్ఫార్మన్స్ కు పీక్స్ అనే మాట చిన్నదే. ఇన్నాళ్ళ తర్వాత దీని సీక్వెల్ కు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత దిల్ రాజు టేకప్ చేయలనుకున్నప్పటికి బడ్జెట్ పరంగా టైం పరంగా ఉన్న రిస్క్ గమనించి ఆయనే స్వచ్చందంగా తప్పుకున్నారు. ఇప్పుడు దీన్ని 2.0 నిర్మిస్తున్న లైకా సంస్థనే చేతుల్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం భారతీయుడు 2కి టీంని సెట్ చేసే పనిలో ఉన్నాడు శంకర్. ఫస్ట్ పార్ట్ తరహాలోనే ఇందులో కూడా ఒక కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర ఒకటి ఉంటుందట. దాని కోసం బాలీవుడ్ సింగం అజయ్ దేవగన్ ను సంప్రదించినట్టు తాజా సమాచారం. 2.0 లో అక్షయ్ కుమార్ తో విలనీ చేయించిన శంకర్ ఇందులో మాత్రం అజయ్ దేవగన్ తో హీరోతో సమానమైన ఇన్వెస్టిగేటివ్ పాత్ర ఆఫర్ చేసినట్టు టాక్. హీరోగా కమల్ హాసనే నటిస్తారు అని వినిపిస్తున్నప్పటికీ కొన్ని అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.

కమల్ హీరోగా నటించిన రెండు సినిమాలు శభాష్ నాయుడు, విశ్వరూపం 2 విడుదల కావాల్సి ఉన్నాయి. అసలు షూటింగ్ పూర్తయ్యాయా లేక ఇంకేదైనా పెండింగ్ ఉందా అనే విషయాలు కమల్ చెప్పడం లేదు. పైగా ఈ రోజు నుంచి అధికారిక రాజకీయ యాత్ర మొదలు పెట్టేసాడు. ఈ పరిస్థితుల్లో భారీ కాల్ షీట్స్ అవసరమయ్యే భారతీయుడు 2 చేస్తాడా అనేది డౌట్ గానే ఉందని కోలీవుడ్ టాక్. ఒకవేళ అదే నిజమైతే బెస్ట్ ఆప్షన్ గా శంకర్ మనసులో తలా అజిత్ ఉన్నాడట.