అల్లాడించిన హాట్ టీవీ యాంకర్

Sun Feb 10 2019 07:00:02 GMT+0530 (IST)

ఇండస్ట్రీ బెస్ట్ మోడల్స్ టార్గెట్ గ్లామర్ ఇండస్ట్రీ. బుల్లితెర వెండితెర రంగంలో రాణించడం కామన్ గోల్. రంగుల ప్రపంచంలో స్టార్ గా వెలిగిపోవాలని కలలుగనడం సహజం. రంగుల కలల్లో విహరించడమే కాదు.. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు అంతే సీరియస్ గా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల పని సులువైపోతోంది. కలల్ని నిజం చేసుకునేందుకు ఓ దారి సులువుగా దొరుకుతోంది. మోడల్స్ ఫోటోషూట్స్ చూసి దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకునే సన్నివేశం కనిపిస్తోంది.ఆ కోవలోనే అమెరికన్ టాప్ మోడల్ టీవీ హోస్ట్ ఆజా డాంగ్ (32) సోషల్ మీడియాలో చేయని ప్రయత్నం లేదు.ఆజాను ఇన్ స్టాగ్రమ్ లో ఏకంగా 160కె ఫాలోవర్స్ అనుసరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు యూత్ లో జోరుగా వైరల్ అయిపోతున్నాయి. ఆజా డాంగ్ అల్ట్రా మ్యాజిక్ బికినీ స్విమ్ సూట్ ప్రస్తుతం హాట్ టాపిక్. లాస్ ఏంజెల్స్ లో ఈ అమ్మడు నివాసం ఉంటుంది.

ఇక సోషల్ మీడియా ట్రెండ్ లో పరిశ్రమ ఎక్కడ ఉన్నా భాషతో పనే లేకుండా అవకాశాలు వస్తున్నాయి. అలా ఆజా డాంగ్ కి ఛాన్సులు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కథానాయికగానూ ప్రయత్నిస్తోందిట. ఎమీజాక్సన్ నోరా ఫతేహి తరహాలో ఈ అమ్మడు కూడా పాపులారిటీ సంపాదించేందుకు ట్రై చేస్తోందట. ప్రస్తుతం ఆన్ లైన్ లో బ్లాగుల ద్వారా ఫిలింమేకర్స్ కీ టచ్ లో ఉంటోందిట. ఈ అమ్మడి ప్రయత్నాలు సఫలం అవుతాయేమో చూడాలి.