Begin typing your search above and press return to search.

బ్యాటింగ్ మొదలెట్టిన మణిరత్నం బ్యూటి

By:  Tupaki Desk   |   23 Feb 2018 5:54 AM GMT
బ్యాటింగ్ మొదలెట్టిన మణిరత్నం బ్యూటి
X
కోలీవుడ్ లో వరసగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ ఐశ్వర్య రాజేష్. తన నటనతో చేస్తున్న ప్రతి పాత్రకూ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తూ పెద్ద డైరెక్టర్లందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాక ముట్టై.. ధర్మదురై లాంటి సినిమాల్లో ఆమె నటన విమర్శకులను మెప్పించింది. ఆమెకు అవార్డులను సైతం తెచ్చిపెట్టింది.

ఐశ్వర్య రాజేష్ రాబోయే సినిమాలో క్రికెటర్ గా కనిపించనుంది. ఓ మహిళా క్రికెటర్ కథతో తెరకెక్కే సినిమా కోసం ఆమె ఇప్పుడు బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఏ పాత్రకైనా నూటికి నూటొక్క శాతం న్యాయం చేస్తుందనే గుర్తింపు ఉన్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో క్రీడాకారిణిగా కనిపించడానికి తగిన ప్రాక్టీస్ చేసే పనిలో పడింది. అరుణ్ రాజా కామరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో చాలా బిజీగా ఉండే హీరోయిన్లలో ఐశ్వర్య పేరు ముందే ఉంది.

డైరెక్టర్ మణిరత్నం తాజాగా షూటింగ్ చేస్తున్న నవాబ్ సినిమాలో ఐశ్వర్య ఓ కీలక పాత్రం చేస్తోంది. ఈ మూవీలో ఆమె అరవింద్ స్వామి.. జ్యోతిక.. శింబు.. అరుణ్ విజయ్.. అదితిరావ్ హైదరి వంటి హేమాహేమీలందరితో కలిసి నటించబోతోంది. గౌతమ్ మీనన్ లేటెస్ట గా విక్రమ్ హీరోగా తీస్తున్న ధ్రువనక్షత్రం సినిమాలో ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తోంది.