ఇష్టం లేకుండానే అది చేశా : రౌడీ హీరోయిన్

Mon May 20 2019 12:19:37 GMT+0530 (IST)

తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించి స్టార్ హీరోయిన్ గా అక్కడ గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్. బుల్లి తెరపై యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఐశ్వర్య మెల్ల మెల్లగా కెరీర్ లో స్టార్ డంను దక్కించుకుంది. తమిళంలో ఈమె పలువురు స్టార్స్ తో నటించింది. అతి త్వరలోనే విజయ్ దేవరకొండతో ఈమె వచ్చేందుకు సిద్దం అవుతోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో విజయ్ దేవరకొండకు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో తాను నటించిన సామి 2 చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.తమిళ స్టార్ హీరో విక్రమ్ తో కలిసి చేసిన సామి 2 చిత్రంపై ఆమె ఇంకా అసంతృప్తిగానే ఉంది. ఆ సినిమాను నేను మొదట చేయవద్దనుకున్నాను. చాలా మంది హీరోయిన్స్ కూడా ఆ పాత్రకు నో చెప్పారు. కాని కొందరు వ్యక్తులు నన్ను వ్యక్తిగతంగా కోరడం వల్ల చేయాల్సి వచ్చింది. రెండు రొమాంటిక్ సీన్స్ రెండు పాటల్లో మాత్రమే కనిపించే పాత్రలను తాను మరెప్పుడు చేయాలని భావించడం లేదు. సినిమాలో తన పాత్ర కీలకం అయితేనే ఇకపై నటిస్తానంటూ చెప్పుకొచ్చింది.

దర్శకుడు హరి సామి 2 చిత్రంలో తన పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరోసారి అలాంటి తరహా పాత్రల్లో నటించవద్దని ఫిక్స్ అయ్యాను. మంచి అవకాశాలు వస్తే పర్వాలేదు లేదంటే ఖాళీగా ఉండాలని భావిస్తున్నట్లుగా ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది. ఇటీవలే ఈమె విజయ్ దేవరకొండతో ప్రేమ పెళ్లి అంటూ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లే అంటూ కొట్టి పారేస్తూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు సామి 2 చిత్రంపై కామెంట్స్ చేయడం ద్వారా మరోసారి వార్తల్లోకి వచ్చింది.