Begin typing your search above and press return to search.

అదేంటి ఐష్ ఆంటీ అంత పని చేశావా?

By:  Tupaki Desk   |   27 July 2016 4:35 PM GMT
అదేంటి ఐష్ ఆంటీ అంత పని చేశావా?
X

పెళ్లి అయి.. పిల్ల తల్లి అయినా అదే అందంతో.. అదే సొగసుతో అందరి మనసుల్ని దోచుకునే ఐశ్వర్యారాయ్ తాజాగా వార్తల్లోకి వచ్చేశారు.పెళ్లి తర్వాత ఏ రోజు ఎదురుకాని చిత్రమన సమస్యను ఆమె ఎదుర్కొంటున్నట్లుగా బాలీవుడ్ గుసగుసలాడుతోంది. ఒక సినిమా విషయంలో ఆమె వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉండటమే కాదు.. ఐష్ ఆంటీ తీరుపై బచ్చన్ ఫ్యామిలీ గుర్రుగా ఉందన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

దీనికి సంబంధించి బయటకు పొక్కిన విషయాల్ని చూస్తే.. కరణ్ జోహార్ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ తో ‘‘యే దిల్ హై ముష్కిల్’’ అనే చిత్రంలో జత కట్టింది. అయితే.. కథ డిమాండ్ చేయటంతో రణ్ బీర్ తో ఐష్ ఆంటీకి కొన్ని ఇంటిమేటెడ్ సీన్స్ ఉన్నట్లు సమాచారం. ఘాటుగా సాగిన ఈ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన సమాచారం బచ్చన్ ఫ్యామిలీకి చేరిందట. దీంతో.. వారు అగ్గి ఫైర్ అవుతున్నారట. అలాంటి సీన్లలో నటించినందుకు ఐష్ మీద వారు ఆగ్రహంగా ఉండటమే కాదు.. ఐష్ అత్త జయాబచ్చన్ కోడలితో మాట్లాడటం లేదని చెబుతున్నారు.

వాస్తవానికి ఈ చిత్రాన్ని ఐష్ ఒప్పుకోవటమే బచ్చన్ ఫ్యామిలీకి ఇష్టం లేదని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బచ్చన్ ఫ్యామిలీలో లొల్లి మొదలైనట్లుగా తెలుస్తోంది. అందుకు మరింత ఎక్కువ చేసేలా హాట్ సీన్లలో యాక్ట్ చేయటం గొడవ పీక్స్ కు వెళ్లినట్లైంది. దీంతో.. ఐష్ నటించిన ఇంటిమేట్ సీన్లను తొలగించాలని బచ్చన్ ఫ్యామిలీ కరణ్ జోహార్ ను కోరిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. పెళ్లి తర్వాత ఎప్పుడూ వివాదాల్లో నిలవని ఐష్ ఆంటీ.. అత్తింటికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించిందా? అన్నది ఇప్పుడు పలువురి మదిని తొలుస్తోంది. ఇది సంగతి అంటూ బాలీవుడ్ మీడియా గుసగుసలు ఆడుతుంది ..ఈ గుసగుసలు పక్కన పెడితే అమితాబ్ ఫామిలీ మీద బాలీవుడ్ మీడియా చేస్తున్న చీప్ రూమర్స్ అని ఫాన్స్ కొట్టి పారేస్తున్నారు