Begin typing your search above and press return to search.

ఐష్‌ స్పెషల్ షో వేసి చూపించేసిందంట

By:  Tupaki Desk   |   28 Oct 2016 11:30 AM GMT
ఐష్‌ స్పెషల్ షో వేసి చూపించేసిందంట
X
అసలు మొన్న జరిగిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలో.. ఇటు ఐశ్వర్య రాయ్ కాని.. అటు అభిషేక్ గాని.. అలాగే అమితాబ్ బచ్చన్ అండ్ జయ కాని.. మరే బచ్చన్ ఫ్యామిలీ మెంబర్ కూడా కనిపించలేదు. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంతకీ సినిమాను ఎందుకు ఎవాయిడ్ చేశారు? కేవలం ఐష్‌ హాటు సీన్లు ఉన్నంత మాత్రాన సినిమాను చూడరా? ఏ అభిషేక్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తుంటే చూడట్లేదూ? ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్ లోకి వస్తే మాత్రం కాస్త వెయిట్ చేయండి.

విషయం ఏంటంటే.. ఏమనుకుందో ఏమో తెలియదుకాని ఐశ్వర్య తన బచ్చన్ సంస్థానానికి అలాగే తన రాయ్ కుటుంబానికి కూడా కలిపి ఒక స్పెషల్ షో వేయించిందట. అందరూ కూడా అక్కడే షో చూసి చాలా హ్యాపీ ఫీలయ్యారట. పర్సనల్ గా సినిమా వాళ్ళకు నచ్చిందో లేదో తెలియదు కాని.. సినిమాలో ఐష్‌ పాత్రను చూసి ఊపిరి పీల్చుకున్నారట. ఇదే విషయం గురించి ఐష్ తాలూకు పబ్లిసిస్టులను అడిగినా కూడా ప్రస్తుతం వాళ్లు నోరు మెదపట్లేదు. అయితే కొందరు సన్నిహితులు మాత్రం జయా బచ్చన్ కు ఎప్పటిలాగానే సినిమా నచ్చలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

గతంలో జయ బచ్చన్ హ్యాపీ న్యూ ఇయర్ సినిమా చూసి బక్వాస్ అంటూ నవ్విపోసింది. కాని సినిమాకు వందల కోట్లు కలక్షన్లు వచ్చాయి. కొంపతీసి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అంటారా? ఏమో ఈ బాలీవుడ్ ఆడియన్స్ ను మనం ఊహించలేం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/