ఫిల్మ్ ఫెస్టివల్ లో అందాల ఐశ్వర్యం

Sun Aug 13 2017 13:58:13 GMT+0530 (IST)

ఏళ్ళు గడుస్తున్నా సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు కానీ అందాల మహారాణి ఐశ్వర్య రాయ్ మాత్రం పెళ్లి  చెసుకుని తల్లి అయినా ఇంకా తన సౌందర్యం తో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు కేన్స్ వంటి ఇంటర్నేషనల్ ఈవెంట్లలో ఆమె తన అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. క్లీవేజ్ సౌందర్యాన్ని తెగ దారబోస్తుంది.

రీసెంట్ గా ఆమె మెల్ బోర్న్ లో జరిగిన ఐఎఫెఫ్ ఎమ్ 2017 ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యారాయ్ తళుక్కున మెరిసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా  డిజైన్ చేసిన దుస్తులతో కూతురు ఆరాధ్య తో కలిసి రెడ్ కార్పెట్ పై నడిచి అందరిని ఆకర్షించింది. అలాగే శుక్రవారం ఆమె ఫెడరేషన్ స్క్వేర్లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య కు ఓ చేదు అనుభవం ఎదురైందట. ఎవరో ఆమె డైమెండ్ జ్యులేరిని మరియు ఆమె ఖరీదైన డ్రెస్ ను దొంగలించారట. అయితే ఈ న్యూస్ బయటకు రాకుండా కార్యక్రమ నిర్వాహకులు జాగ్రత్తపడ్డారని తెలుస్తోంది. దీంతో  ఐశ్వర్య కూడా ఎందుకులే అని ఆ విషయంపై ఇంతవరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

ఏదేమైనా కూడా 40+ హీరోయిన్ల గ్యాంగులో ఐశ్వర్య ఇంకా మకుటం లేని రాణి అని చెప్పొచ్చుకాని.. ఇంకా హీరోయిన్ గా పాత్రలు కావాలంటే మాత్రం కష్టమే సుమీ.