Begin typing your search above and press return to search.

యంగ్‌గా క‌నిపించ‌డం లేదు నాయ‌నా!!

By:  Tupaki Desk   |   5 Sep 2015 5:19 AM GMT
యంగ్‌గా క‌నిపించ‌డం లేదు నాయ‌నా!!
X
అమ్మ‌త‌నంలోని క‌మ్మ‌త‌నం చూశాక .. రెండో ఇన్నింగ్స్‌ మొద‌లు పెట్టి .. వెండితెర‌ను ఏల్తున్నారు కొంద‌రు నాయిక‌లు. అప్ప‌ట్లో ఇంగ్లీష్ వింగ్లీష్‌ తో అతిలోక సుంద‌రి ఘ‌న‌మైన రీఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత జ్యోతిక సూర్య ప్రోత్సాహంతో రేసులోకి వ‌చ్చింది. 36వ‌య‌దినిలే తో హిట్ కొట్టింది. ఇప్పుడు అదే బాట‌లో బాలీవుడ్ మేటి నాయిక ఐశ్వ‌ర్యారాయ్ కూడా తిరిగి ముఖానికి రంగేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

గారాల ప‌ట్టీ ఆరాధ్య ఇప్ప‌టికే బుడిబుడి న‌డ‌క‌లతో స్కూలుకు వెళ్లే వ‌య‌సుకు ఎదిగేసింది. కాబ‌ట్టి ఇక త‌న రీఎంట్రీకి ఇదే స‌రైన టైమ్ అని భావించిన ఐసూ ముఖానికి రంగేసుకుని సెట్స్‌ లో బిజీ అయిపోయింది. అమ్మ రోల్ నుంచి హీరోయిన్ రోల్‌కి మేకోవ‌ర్ కోసం రూపురేఖ‌ల్లోనూ మార్పులు తెచ్చింది. ప్ర‌స్తుతం సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో జ‌జ్బా .. అనే చిత్రంలో న‌టిస్తోంది. 2007 సౌత్ కొరియ‌న్ మూవీ సెవెన్ డేస్‌కి అధికారిక రీమేక్ ఇది. ఇర్ఫాన్‌ఖాన్‌, స‌బానా ఆజ్మీ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం జ‌జ్బా చిత్రంలోని బండేయా అనే సాంగ్‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ పాట‌లో త‌న‌ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ పిక్‌ని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది ఐష్‌. ఈ లుక్ చూసిన వారంతా ముదిమి వ‌య‌సు బైట‌ప‌డిపోయింద‌ని అంటున్నారు. ఐష్ లో మునుప‌టి ఛామ్ మిస్స‌య్యింది. ఎంతైనా వ‌య‌సు నాలుగు ప‌దుల‌కు చేరువ‌వుతోంది క‌దా! అని అంటున్నారు. ఇద్ద‌రు, ధూమ్‌2లో లుక్ కావాలంటే కుదురుతుందా?