Begin typing your search above and press return to search.

అనుష్క కథ నొక్కేశారా ఏంటి?

By:  Tupaki Desk   |   23 Aug 2017 1:58 PM GMT
అనుష్క కథ నొక్కేశారా ఏంటి?
X
ఇండియాలో ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే అందులో ఒక బాషా నుంచి తెరకెక్కిన సినిమాలు మరో భాషలో రీమేక్ చేసినప్పుడు ఒక్కోసారి హిట్ అవుతుంటాయి లేదా ప్లాఫ్ అవుతుంటాయి. అయితే రీమేక్ హక్కులను పొందకపోయినా కొన్ని సినిమా కంటెంట్ లు మ్యాచ్ అవుతుంటాయి. దీంతో విడుదల తర్వాత వివాదాలను ఎదుర్కోక తప్పదు.

మొన్నటికి మొన్న ఓ బాలీవుడ్ మూవి మగధీర సినిమా కథను పోలి ఉందని హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కాని రాబ్తా మేకర్లు కాదన్నారు. చివరకు సినిమా ఫ్లాపైంది. అయితే ఇప్పుడు అదే తరహాలో తెలుగులో అనుష్క నటించిన సైజ్ జీరో సినిమాను పోలి ఉన్న సినిమా తెలుస్తోంది. అందాల తార ఐశ్వర్య రాయ్ చాలా రోజుల తర్వాత వెండితెరపై మెరవడానికి సిద్దమైన సినిమా కథ అనుష్క నటించిన సైజ్ జిరో అని టాక్. కాకపోతే ఆ సినిమాలో ఐశ్వర్య లావెక్కదు కాని.. ఒక కొత్త పిల్ల చాలా లావుగా ఉంటుంది. ఆ పిల్ల తండ్రిగా అనిల్ కపూర్ కనిపించనున్నాడు. అనిల్ కూతురు.. ఒక సింగర్ రోల్ చేస్తున్న ఐశ్వర్యను చూసి సన్నబడాలని తహతహలాడుతుంది. అదే సినిమా. చూస్తుంటే అనుష్క రోల్ కొత్తమ్మాయ్.. ఐశ్వర్య మాత్రం సోనాల్ చౌహాన్ రోల్ ను పోషిస్తూ.. అనిల్ కపూర్ మాత్రం ఊర్వశి పోషించిన పాత్రను పోషిస్తున్నాడేమో అనే సందేహం వస్తోంది కదూ.

ఇకపోతే ఈ సినిమాకు ఫానే ఖాన్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇది అనుష్క కథ అని తెలుసుకున్నారా లేదా అని తెలియాలంటే సినిమా అధికారికంగా స్టార్ట్ అయ్యేవరకు ఏం చెప్పలేము. కానీ సైజ్ జీరో కంటెంట్ ఉంటే మాత్రం కాపీ రైట్స్ ఇష్యూ వార్తల్లో నిలవక తప్పదు.