Begin typing your search above and press return to search.

ఆ ముద్దులు హగ్గులు వేరండీ బాబూ

By:  Tupaki Desk   |   23 Oct 2016 4:33 AM GMT
ఆ ముద్దులు హగ్గులు వేరండీ బాబూ
X
యే దిల్ హై ముష్కిల్ రిలీజ్ కి అడ్డంకులు తొలగిపోయాయి. పాకిస్తాన్ యాక్టర్ ఫవాద్ ఖాన్ తో యాక్ట్ చేయించడంతో.. అడ్డుకుంటామన్న ఎంఎన్ ఎస్.. ఆర్మీ ఫండ్ కి 5 కోట్లు విరాళం ఇప్పించి మరీ విడుదలకు ఓకే చెప్పింది. ఎట్టకేలకు ఈ నెల 28న రిలీజ్ కు అన్ని అగచాట్లు దాటుకున్న యే దిల్ హై ముష్కిల్ పై.. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ కొత్త సంగతులు చెబుతోంది.

అసలీ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి అతి ముఖ్య కారణం.. ఐశ్వర్యారాయ్ 42 ఏళ్ల వయసులో.. తనకంటే దాదాపు 10ఏళ్లు కుర్రాడయిన రణబీర్ కపూర్ తో రొమాన్స్ పండించడమే. అయితే.. ఐష్ ఇలాంటి రోల్ చేయడంపై చాలానే విమర్శలొచ్చాయి. ఇప్పటివరకూ సైలెంట్ గా ఉన్న ఐష్.. తొలిసారిగా యే దిల్ హై ముష్కిల్ లోని హాట్ సీన్స్ పై పెదవి విప్పింది. రణబీర్ తో తాను చేసిన ఏ సన్నివేశం కూడా అసభ్యంగానో.. అందాల ప్రదర్శన మాదిరిగానో ఉండదని తేల్చేసింది ఐశ్వర్యా రాయ్.

ఆ ముద్దులు.. హగ్గులు లెక్క వేరని.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని పండించడంలో పొయెటిక్ టచ్ ఉంటుంది తప్ప.. రెచ్చగొట్టేలా చేయలేదంటోంది ఐశ్వర్య. తాను 20ఏళ్ల క్రితం చేసినప్పటి రోల్ చేయాలనే ఆఫర్ వస్తే.. దాన్ని ఈ వయసులో ఎలా హ్యండిల్ చేయాలో అలా చేశానే తప్ప.. అంతకుమించి ఏం చేయలేదన్నది ఈమె వెర్షన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/