Begin typing your search above and press return to search.

ఐష్ కి మండింది.. వాకౌట్‌ చేసింది

By:  Tupaki Desk   |   25 May 2016 4:06 AM GMT
ఐష్ కి మండింది.. వాకౌట్‌ చేసింది
X
మాజీ మిస్ వరల్డ్ - బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ సాధారణంగా కూల్ గానే ఉంటుంది. ప్రెస్ మీట్స్ లోనూ, అభిమానులతో ముచ్చట్లలోనూ ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఇట్టే సమాధానం ఇచ్చేస్తుంది. ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ కు తన బ్రిలియన్సీతో ఎస్కేపింగ్ ఆన్సర్స్ ఇవ్వడం ఐష్ కి హ్యాబిట్. అలాంటి ఐశ్వర్యారాయ్.. ఇప్పుడు సల్మాన్ గురించి అడిగితే అర్ధాంతరంగా ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ప్రస్తుతం సరబ్ జిత్ చిత్రం కోసం యాక్టివ్ గా ప్రమోషన్స్ చేస్తోంది ఐశ్వర్య. రీసెంట్ గా నిర్మాత వషు భగ్నాని కార్యాలయంలో ఇలాంటి ఓ ఈవెంట్ లో.. ఐష్ కు ఓ ప్రశ్న ఎదురైంది. 'భవిష్యత్తులో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయా?'.. ఇదీ ఆ విలేఖరి అడిగిన ప్రశ్న. అంతవరకూ సింపుల్ గా ఉన్న ఐష్ కి.. ఈ ఒక్క క్వశ్చన్ తో చిర్రెత్తుకొచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అంతే కాదు.. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి అక్కడ ఉన్న అన్ని కెమేరాల్లో ఫుటేజ్ ని పూర్తిగా తొలిగించేలా చేసింది కూడా.

సల్మాన్ విషయంలో గతంలో ఎప్పుడూ ఐష్ ఇలా ప్రవర్తించలేదు. గత నెలలో రియో ఒలింపిక్స్ కు సల్లూ భాయ్ ని ఎంపిక చేసినప్పుడు కూడా.. 'దేశానికి గౌరవం - వన్నె తెచ్చిపెట్టేందుకు ఎవరు ఏ పాత్రనైనా పోషించవచ్చు. దానికి ఆయా రంగాలతో సంబంధం లేదు' అంటూ సల్మాన్ కు సపోర్ట్ గా కూల్ గానే మాట్లాడింది. ఇప్పుడు మాత్రం సల్లూ భాయ్ పేరెత్తగానే ఇంతగా ఎందుకు రియాక్ట్ అయిందో.. ఎవరికీ అర్ధం కాలేదు.