Begin typing your search above and press return to search.

18 ఏళ్ల క్రితం.. రణబీర్ - ఐష్

By:  Tupaki Desk   |   28 Sep 2016 2:18 PM GMT
18 ఏళ్ల క్రితం.. రణబీర్ - ఐష్
X

సుమారు 18ఏళ్ల నాటి మాట. రిషికపూర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన "ఆ ఆబ్ లాత్ ఛలే" సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా సరసన ఐశ్వర్య రాయ్ నటించింది. ఇంతకూ ఈ టాపిక్ ఇప్పుడెందుకు వచ్చిందో అర్ధమయ్యిందా? మీరు చూసిన ఈ ఫోటో.. ఆనాడు తీసిందే. అవును ఈ సినిమాకు రణబీర్ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ సందర్భంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటొనే ఇది. అయితే ఈ ఫోటో చాలా కాలం క్రితం తానే తీశానని ట్వీట్ చేశారు రమీ జాఫ్రే.

ఈ ఫొటోలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ పక్కనున్న ఈ యువకుడు, నాటి అసిస్టెంట్ డైరెక్టర్, నేటి బాలీవుడ్ యంగ్ హీరో.. రణబీర్ కపూర్. వయసులో తనకంటే చిన్నవాడైన రణబీర్ కపూర్ తో కలిసి ఐశ్వర్య రాయ్ తాజాగా "ఏ దిల్ హై ముష్కిల్" అనే సినిమాలో నటించింది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల క్రితం నాటి ఈ ఫొటో వార్తల్లోకి వచ్చింది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన సందర్భంగా... "భవిష్యత్ లో వీరిద్దరూ కలిసి నటిస్తారని ఊహించలేదు" అని జాఫ్రే పేర్కొన్నారు.

కాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఏ దిల్ హై ముష్కిల్" సినిమాలో రణబీర్ - ఐశ్వర్య లతోపాటు అనుష్క శర్మ నటించారు. అక్టోబర్ 28న దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలయిన ఏ దిల్ హై ముష్కిల్ సాంగ్స్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/