పెళ్లిలో ఐశ్వర్యారాయ్ స్క్వేర్

Mon Dec 10 2018 14:21:22 GMT+0530 (IST)

ప్రస్తుతం ఏ నోట విన్నా బిలియన్ ట్రిలియన్ డాలర్ శ్రీమంతుడు అంబానీ ఇంట పెళ్లి గురించే. ఈ పెళ్లి వేడుక కోసం ముంబై నుంచి జాతరలా సెలబ్రిటీలు తరలి వెళ్లడం - ఉదయ్ పూర్ (రాజస్థాన్ )ని ముంచెత్తడం హాట్ టాపిక్ గా మారింది. అరెరే.. బాంద్రా - పాళీ హిల్స్ (ముంబై) ఖాళీ అయిపోయి మూగనోము పాటించాయే అంటూ జనం చెప్పుకుంటున్నారు. అమెరికా నుంచి హిల్లరీ క్లింటనే దిగొచ్చింది. ప్రఖ్యాత పాప్ గాయని బియాన్స్ ఉరకలెత్తుతూ ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వచ్చి  సంగీత్ వేడుకలో నాట్యమాడింది.అలాంటి చోట ఎవరూ భేషజానికి పోలేదు. మొన్ననే పెళ్లయినా.. కొత్త జంటలు అన్న ఫీలింగే లేకుండా పీసీ- నిక్ - దీపిక- రణవీర్ సింగ్ జంటలు డ్యాన్సులు చేయడం వేడెక్కించింది. ఇదే పెళ్లిలో ముఖేష్ అంబానీ భార్యామణి నీతా అంబానీ సైతం సెలబ్రిటీలతో స్టెప్పులు కలపడం - వినోదాన్ని ఆస్వాధించడం హైలైట్.

బియాన్స్ - పీసీ - దీపిక ఈ వేడుకకు ఎంతటి ఆకర్షణగా నిలిచారో - అంతకుమించి ఐశ్వర్యారాయ్ - బుల్లి ఐష్ ఆరాధ్య అంతే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సంగీత్ వేడుకలో ఐశ్వర్యారాయ్ - ఆరాధ్య ఇద్దరూ రాజస్థానీ స్టైల్ డ్యాన్సులతో అదరగొట్టేశారు. ఈ వేడుక నుంచి ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరాధ్య క్యూట్ లుక్స్ కట్టిపడేస్తున్నాయి. ఉదయ్‌పూర్ -ఒబెరాయ్ ఉదైవిలాస్ లో అత్యంత వైభవంగా ఈ వేడుకలు సాగుతున్నాయి.