Begin typing your search above and press return to search.

పిక్ టాక్: ఐశ్వర్య ఐశ్వర్యే

By:  Tupaki Desk   |   10 Dec 2017 7:36 AM GMT
పిక్ టాక్: ఐశ్వర్య ఐశ్వర్యే
X
వయసు పెరిగినా వన్నె తగ్గని అందం ఐశ్వర్యది. 40 ప్లస్ వయసులో ఉన్నా.. ఒక బిడ్డకు తల్లి అయినా.. ఇప్పటికీ ఐశ్వర్య ఆకర్షణే వేరు. ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవడంలో.. ఏదైనా వేడుకకు వెళ్లాల్సి వస్తే అదిరిపోయే డ్రెస్సింగ్ లో రెడీ కావడంలో ఐశ్వర్యకు తిరుగుండదు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఆమె ఫ్యాషన్ విషయంలో మళ్లీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తాజాగా ముకేష్ అంబానీ ఇంట్లో జరిగిన పార్టీకి ఐశ్వర్య తయారై వచ్చిన తీరుకు అందరూ ముగ్ధులైపోయారు. ఆమె వేసుకున్న గోల్డెన్ గౌన్ పార్టీలో హాట్ టాపిక్ అయింది. కొంచెం క్లీవేజ్ అందాల్ని ఎక్స్ పోజ్ చేస్తూనే క్యూట్ అనిపించేలా తయారై వచ్చింది ఐశ్వర్య. ఓవరాల్ గా ఆమె స్టైలింగ్ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. భర్త అభిషేక్ బచ్చన్ కూడా వచ్చినప్పటికీ అందరి కళ్లూ ఐశ్వర్య మీదే నిలిచాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో ‘యే దిల్ హై ముష్కిల్’.. ‘సరబ్జిత్’ లాంటి సినిమాల్లో నటించిన ఐశ్వర్య.. వచ్చే ఏడాది ‘ఫానీ ఖాన్’ అనే సినిమాతో పలకరించబోతోంది. ఆ సినిమా ఐశ్వర్య కెరీర్లో ఒక మైలురాయిలా నిలుస్తుందని అంటున్నారు.