Begin typing your search above and press return to search.

ఐష్ స్టయిలే వేరబ్బా!!!

By:  Tupaki Desk   |   9 Oct 2015 6:08 PM GMT
ఐష్ స్టయిలే వేరబ్బా!!!
X
ఐశ్వర్యా రాయ్ రీ ఎంట్రీ అదిరిపోయింది. కన్న బిడ్డని కిడ్నాప్ చేయడంతో... ఓ క్రిమినల్ తరఫున వాదించాల్సి వచ్చిన లేడీ లాయర్ పాత్రను పోషించింది ఐష్. సినిమాకి మిక్సెడ్ రెస్పాన్స్ వస్తున్నా.. ఐశ్వర్య యాక్టింగ్ కి మాత్రం ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. ఏళ్ల తర్వాత ఇచ్చిన రీఎంట్రీ.. పర్ఫెక్ట్ గా ఉందంటున్నారు.

సినిమాని ఐశ్వర్య చుట్టూనే తిరగేలా తీశాడు డైరెక్టర్ సంజయ్ గుప్తా. ఎమోషన్స్, వేరియేషన్స్ లాంటివన్నీ ఐష్ పాత్రకే పరిమితమయ్యాయి. కొరియన్ థ్రిల్లర్ సెవెన్ డేస్ కి ఇది రీమేక్. అయితే ఒరిజినల్ ని అలా మిగల్చకుండా... ఐష్ చుట్టూ రన్ అయ్యేలా స్క్రీన్ ప్లే మార్చేశారు. దీంతో అరుపులు, ఏడుపులు, ఛేజింగ్ లు.. అన్నీ ఐశ్వర్య వంతే అయ్యాయి. అయితే ఐష్ పరంగా చూసుకుంటే.. ఇది గ్రాండ్ రీఎంట్రీయే అని చెప్పాలి. ప్రమోషన్స్ కూడా హై లెవెల్ లోనే చేస్తోంది నీలికళ్ల సుందరి.

ఓ ప్రమోషన్ కార్యక్రమానికి మోకాళ్ల దగ్గర వరకూ కట్స్ ఉన్న వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ తో వచ్చి తన స్టయిల్ ని మరోసారి రుచి చూపించింది. వయసు మీదపడుతున్నా.. అందాన్ని, హీరోయిన్ గా తన స్థాయిని కాపాడుకుంటోందంటే.. ఐష్ గ్రేటేనబ్బా. ఆ స్టయిలూ.. ఆ హొయలూ.. అన్నీ ఓ రేంజులో ఉంటాయి. మరి జజ్బా కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. లెటజ్‌ వెయిట్‌ ఫర్‌ టుమారో!!