కేన్స్ అంటే గ్లామర్ కంటెంటేనా??

Fri May 19 2017 15:45:56 GMT+0530 (IST)

కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మొదలైంది. కెమెరాల కళ్లన్నీ ప్రాన్స్ వైపే దృష్టి పెట్టాయి. ఈసారి రెడ్ కార్పెట్ పై నడిచే సుందరీమణుల అందాలను మరింత అందంగా చూపించే పనిలో బిజీగా ఉన్నాయి. సరికొత్త ఫ్యాషన్ డ్రస్సులతో.. అదరగొట్టే ఒంపుసొంపులతో వయ్యారంగా నడిచివచ్చే హీరోయిన్స్ ప్రతిసారీ హాట్ టాపిక్ గా నిలుస్తారు. ఇక్కడ తమ అందాన్ని ఎవరు బాగా చూపిస్తారో ఇంటర్నేషనల్ మీడియా మొత్తం వాళ్లను పొగడ్తల్లో ముంచెత్తడమే పనిగా పెట్టుకుంటుంది. గతంలో సెక్సిణి మల్లికా షెరావత్ కూడా కేన్స్ ఫెస్టివల్ తన అందాల ప్రదర్శనతో అందరికీ మత్తెక్కించింది.

ఈ ఏడాది భారతదేశం నుంచి ముగ్గురు సుందరాంగులకు రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశమొచ్చింది. బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపికా పదుకొనే సోనమ్ కపూర్ తోపాటు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ లకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు ఆహ్వానం లభించింది. దీపిక ఇప్పటికే అక్కడ వాలిపోయింది. నిగారించే తొడల అందాలు కనిపించేలా వేసుకున్న గ్రీన్ కలర్ గౌన్ తో రెడ్ కార్పెట్ పై దీపిక ఫొటోలకు ఇచ్చిన ఫోజులు మతులు పోగొట్టేశాయి.  ఐశ్వర్యారాయ్ సోనమ్ కపూర్ తర్వాత ప్రత్యేకంగా రెడ్ కార్పెట్ పై సందడి చేయనున్నారు.

అసలుకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి సినిమాలకు గుర్తింపు ఇచ్చే వేదిక. అదేమిటో ఇక్కడ సుందరాంగుల ఒంపుసొంపులు వారి అందాల ఆరబోతలకు లభించే గుర్తింపు సినిమాలకు లభించదు. టాబ్లాయిడ్స్ లోనూ ఆ విషయమేమీ ప్రస్తావనకు రాదు. ఏ భామ ఎంత సెక్సీగా కనిపించిందనే మ్యాటర్ తప్ప ఏ సినిమాలో ఏ విషయం ఉందో ప్రస్తావనే ఉండదు. కొన్నేళ్ల క్రితం ‘మసాన్’ అనే భారతీయ చిత్రం ఈ ఫిలిం ఫెస్టివల్ లో స్థానం దక్కిందనే విషయం చాలామందికి తెలియదు. గ్లామర్ కంటెంట్ ముందు టాలెంట్ కనిపించకుండా పోతోందన్న మాట. ఏం చేస్తాం. ప్చ్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/