కోట్లు ఇస్తామంటున్న అందాల భామలు

Fri May 19 2017 19:39:12 GMT+0530 (IST)

సహజంగా అందాల భామలు లక్షలు.. కోట్లు తీసుకోవడమే చేస్తుంటారు. ప్రతీ చిన్న అంశాన్ని కమర్షియల్ చేసేయగల ట్యాలెంట్ ఈ సొగసరుల సొంతం. ఆఖరికి సోషల్ మీడియాలో పెట్టే చిన్న ట్వీట్లను.. ఫోటోలను కూడా అమ్మేసుకోగల సమర్ధులు చాలా మందే ఉన్నారు. కొందరు దానధర్మాలు చేస్తుంటారు కానీ.. ఇచ్చే వారి సంఖ్య.. ఇచ్చే మొత్తం తక్కువగానే ఉంటుంది. మరి ఇప్పుడు కోట్లు ఇస్తామనే భామలు ఎవరనే సందేహం రావడంలో ఆశ్చర్యం లేదు.

ఐశ్వర్యా రాయ్.. మాధురీ దీక్షిత్ లలో ఒకరు కోట్ల కొద్దీ సొమ్ములు ఇస్తామంటున్నారు. అలాగని అదేమీ వారి సొంత సొమ్ము కాదు లెండి.. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం లో భాగంగా సోనీ ఛానల్ వాళ్ల తరఫున వీళ్లు ఇస్తారంతే. కేబీసీ 9వ సీజన్ కు ఆ ఛానల్ సిద్ధమవుతోంది. ఈ సారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కొత్త హోస్ట్ ను తీసుకురాబోతున్నారు. మొదట రణబీర్ కపూర్ చేతికి ఈ బాధ్యతలు ఇద్దామని అనుకున్నా.. ఆ యంగ్ హీరో చివరకు కుదరదని అనేశాడు.

దీంతో అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను కేబీసీ నిర్వహించాల్సిందిగా ఛానల్ వర్గాలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ను కూడా ఇప్పటికే సోనీ వర్గాలు అప్రోచ్ అయ్యాయట. ఈ ఇద్దరిలో ఎవరు ముందు సై అంటే.. వారికి ఈ అవకాశం దక్కనుందని తెలుస్తోంది. ఏమైనా.. 8 సీజన్లుగా స్టార్ హీరోలు నిర్వహించిన ఈ కార్యక్రమం.. ఇప్పుడు ముద్దుగుమ్మల చేతిలోకి వెళ్లడం అయితే ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/