Begin typing your search above and press return to search.

యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్న రజినీ డాటర్

By:  Tupaki Desk   |   21 Oct 2016 6:25 AM GMT
యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్న రజినీ డాటర్
X
తమిళ సినిమా ఇండస్ట్రీ దిగ్గజాలైన రజినీకాంత్.. కమల్ హాసన్ లకు ఓ పోలిక ఉంది. సమకాలికులు అయిన ఈ ఇద్దరికీ.. ఇద్దరేసి చొప్పున కూతుళ్లు ఉన్నారు. కమల్ డాటర్స్ శృతి హాసన్-అక్షర హాసన్ లు ఆన్ స్క్రీన్ పై వెలుగుతుంటే.. రజినీ కూతుళ్లు ఐశ్వర్య-సౌందర్యలు మాత్రం తెర వెనక టెక్నీషియన్స్ గా సత్తా చాటుతున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యా ధనుష్.. ఇప్పుడు వెండితెరపై అరంగేట్రానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. గతంలో ధనుష్ తో 3.. గౌతమ్ కార్తీక్ తో వాయ్ రాజా వాయ్ అంటూ రెండు సినిమాలను డైరెక్ట్ చేసిన ఈమె.. తొలిసారిగా తెరపై కనిపించనుందని కోలీవుడ్ జనాలు అంటున్నారు. ధనుష్ నిర్మాతగా.. కబాలి డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో.. రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న మూవీలో ఓ పాత్రలో ఐశ్వర్య నటించనుందని తెలుస్తోంది.

ఐశ్వర్యా ధనుష్ చేయనున్నది పూర్తి స్థాయి పాత్రో.. లేక కేమియో లాంటి రోల్ తో సరిపెడతారో ఇంకా తెలీలేదు కానీ.. ఈమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ అయితే ఖాయమైందట. అయితే.. ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒకటి పెండింగ్ లో ఉంది. ప్రస్తతం సినిమా వీరన్ అంటూ తండ్రి జీవితంపై ఓ డాక్యుమెంటరీ తీసే పనిలో ఉంది లేడీ డైరెక్టర్.