Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: శర్మా.. ఏంటీ అరాచకం??

By:  Tupaki Desk   |   22 March 2017 5:06 PM GMT
ఫోటో స్టోరి: శర్మా.. ఏంటీ అరాచకం??
X
నిజానికి 'రోగ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుందని అనుకుంటే.. సెక్సీ మోడల్ అయేషా శర్మ మాత్రం మధ్యలోనే ఎందుకో జంప్ అయిపోయింది. చిరుత సినిమా ఫేం హీరోయిన్ నేహా శర్మ చెల్లెలైన ఈ సుందరాంగి హీరోయిన్ గా మాత్రం తెరంగేట్రం చేయడానికి నానా ఇబ్బందులు పడుతోంది. అయితే ఫ్యూచర్లో వెండితెరపై ఆరబోయాల్సిన అందాలను ఇప్పుడే అమ్మడు లైవ్లో చూపిస్తుంటే.. పిచ్చెత్తిపోతోంది.

అరాచకం అనేది చిన్న పదం అవుతుందనే చెప్పాలి.. అసలు ఈ సెక్సీ శర్మగారి నిట్టూర్పులు చూస్తుంటే. అమ్మడు తన అందాల దుకాణాన్ని అనువనువనుగా ఆరబోస్తూ.. చాలా క్లోజ్ లో బీభత్సమైన రెజొల్యుషన్ ఉన్న ఫోటోలను తీసి.. వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే.. వామ్మో అది అరాచకమే మరి. ఎందుకంటే అమ్మడు సౌష్టవాన్ని అలా తీక్షణంగా రెండు నిమిషాలు వీక్షిస్తే.. ఇక ఒక కంటితో మరో కన్ను యుద్దం చేసుకోవాల్సిందే.

ఎవరేమనుకున్నా కూడా.. అయేషా మాత్రం హీటెక్కించేస్తోంది. ఒక ప్రక్కన ఆల్రెడీ ఇండియాలో సమ్మర్ ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే.. ఈ సుందరి మాత్రం కాస్తంతా కూడా కనికరించట్లేదు.