Begin typing your search above and press return to search.

అప్పుడే రెండో సినిమా కూడానా!?

By:  Tupaki Desk   |   25 Nov 2015 5:42 AM GMT
అప్పుడే రెండో సినిమా కూడానా!?
X
ముంబై ముద్దుగుమ్మ ఐషా శ‌ర్మ జెట్ స్పీడ్‌ తో దూసుకుపోతోంది. నిన్న‌టికి నిన్న పూరి ద‌ర్శ‌క‌త్వంలో రోగ్ మూవీలో నాయిక‌గా న‌టిస్తోంది అంటూ ప్ర‌చార‌మైంది. ఇంత‌లోనే మ‌రో కొత్త న్యూస్‌ తో షేకాడించేస్తోంది. నిన్న‌టికి కేవ‌లం వ‌న్ ఫిలిం కిడ్‌ గా ఉన్న ఈ భామ ఇప్పుడు రెండో ఛాన్స్ కూడా అందుకుంది. అక్కినేని హీరో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ప్రేమ‌మ్ రీమేక్‌ లో క‌థానాయిక‌గా ఫైన‌ల్ అయ్యింది. ఈ అమ్మ‌డి స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్‌ లో త‌న‌కంటూ ఓ రేంజుకి చేరిపోయేట్టే క‌నిపిస్తోంది.

నాగ‌చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ప్రేమ‌మ్ ఈ డిసెంబ‌ర్‌ లో విశాఖ‌ప‌ట్నంలో ప్రారంభం కానుంది. శ్రుతిహాస‌న్‌ - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇప్పుడు మూడో నాయిక‌గా ఐషా శ‌ర్మ‌ను క‌థానాయిక‌గా ఎంపిక చేసుకోవ‌డం టాలీవుడ్‌ లో చ‌ర్చ‌కు దారి తీసింది. ఎవ‌రీ ఐషా ? ఇంత స్పీడ్‌ గా దూసుకొచ్చేసింది? ఏమంత గొప్ప న‌టి అనుకోవాలా? అన్న చ‌ర్చ సాగుతోంది. నిజానికి ఈ ఆఫ‌ర్ ఐషాకి ద‌క్కేది కాదు. ఓ సీనియ‌ర్ క‌థానాయిక కోసం ఇంత‌కాలం వేచి చూసిన చైతూ - మొండేటి అండ్ టీమ్ చివ‌రికి విసిగిపోయి కొత్త నాయిక అయినా ఫ‌ర్వాలేద‌నుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. మొత్తానికి అలా చైతూ స‌ర‌స‌న ఐషాకి ఛాన్సొచ్చింద‌న్న‌మాట‌!