బాల్కనీలో బికినీ ట్రీట్

Sun Jun 24 2018 11:15:12 GMT+0530 (IST)

తెలుగులో ‘చిరుత’ సినిమాతో కథానాయికగా పరిచయమైన నేహా శర్మ.. మొదట్లో చాలా పద్ధతిగా కనిపించేది. కానీ తర్వాత తర్వాత ఆమెలోని మరో యాంగిల్ బయటికొచ్చింది. గత కొన్నేళ్లలో నేహా హాట్ హాట్ ఫొటో షూట్లతో ఎలా రెచ్చిపోయిందో తెలిసిందే. అక్క వారసత్వాన్నందుకుని ఆయిషా శర్మ కూడా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది కొన్నేళ్లుగా. సినిమాల్లోకి అడుగుపెట్టకముందే ఆమె ఓ రేంజిలో రెచ్చిపోతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. మామూలుగా అమ్మాయిలు బీచ్ లో బికినీ ట్రీట్ చేస్తారు.

కానీ ఆయిషా మాత్రం తన ఫ్లాట్ బాల్కనీ నుంచి బికినీ విందు చేసింది. ఏదో క్యాజువల్ గా బికినీ వేసి బాల్కనీలో నిలబడితే ఎవరో ఫొటో తీసి పెట్టేసినట్లుగా అనిపిస్తోంది కానీ.. నిజానికి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఫొటో షూటే. ఈ ఫొటో చూసిన కుర్రాళ్లకు టెంపరేచర్లు పెరగిపోతున్నాయి. ఇంకా తొలి సినిమా విడుదల కాకముందే ఇలా రెచ్చిపోతే.. ఇక తెరపై ఆమె ఏ స్థాయిలో హాట్ షోలు చేస్తుందో అని జనాలు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్లో ఆమె ఇప్పటికే ఓ సినిమా కమిటైంది. దక్షిణాది నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్లు చెబుతున్నారు. మరి కథానాయికగా ఆమె ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.