Begin typing your search above and press return to search.

పాట చూస్తే ఆ పాపకు కష్టమే కదూ

By:  Tupaki Desk   |   28 Sep 2016 5:07 PM GMT
పాట చూస్తే ఆ పాపకు కష్టమే కదూ
X
ఐషా శర్మ అని ఓ ఔత్సాహిక హీరోయిన్ ఉంది. ఇప్పటికే హీరోయిన్ అయిపోవాల్సి ఉంది కానీ.. ఇంకా అమ్మడికి టైమ్ మాత్రం కలిసి రాక.. ప్రయత్నాల దగ్గరే ఆగిపోయింది. ఈ మధ్యనే శ్రీలంక వెకేషన్ వెళ్లి.. అక్కడి నుంచి వీలైనన్ని అందాలను ఫోటోలు తీసి.. తీయించుకుని నెట్లో పెట్టేసింది ఐషా శర్మ. ఇంతకీ ఈమె ఎవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చిరుత మూవీలో కనిపించిన నేహశర్మ చెల్లెలే ఈ ఐషా శర్మ.

చెల్లిని ఎలాగైనా హీరోయిన్ చేసేయాలని అక్క నేహ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. వీటిలో భాగంగా.. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'ఇక్ వారి హా కహ్ దే' వీడియో ఆల్బంలో నటించిందీ పాప. ఏ విషయానికి ఆ విషయమే చెప్పుకుంటే.. అసలు డ్రెసింగ్ విషయంలో మాత్రం అమ్మడికి చిన్నపాటి అబ్జెక్షన్స్ కూడా లేనట్లు కనిపిస్తోంది. కేరక్టర్.. సిట్యుయేషన్ డిమాండ్ చేసినా చేయకపోయినా.. ప్రొడ్యూసర్-హీరో-డైరెక్టర్లలో ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకోమన్నా సై అనేస్తుందేమో అనిపించక మానదు.

అయితే.. గ్లామర్ షో యాంగిల్ లో ఐషా శర్మ డిస్టింక్షన్ లో పాస్ అయిపోతుంది కానీ.. యాక్టింగ్ పరంగా సంగతేంటి అంటే మాత్రం.. నోరు పెగలడం కష్టం. ఆల్బం సూపర్ గా ఉంది కాబట్టి సరిపోయింది కానీ.. లేకపోతేనా.. అంతసేపు ఈమె ఎక్స్ ప్రెషన్ లెస్ ఫేసును చూడ్డం కష్టమే అనిపిస్తోంది. మరి సినిమాల్లో ఛాన్స్ ఏమైనా ఇంప్రూవ్ అయిపోతుందంటారా!