Begin typing your search above and press return to search.

ఒక్కడే కబాలి ని విమానం ఎక్కించాడట

By:  Tupaki Desk   |   1 July 2016 11:22 AM GMT
ఒక్కడే కబాలి ని విమానం ఎక్కించాడట
X
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రానికి ఎయిరేషియా ఇండియా అధికారికంగా భాగస్వామి అయిన విషయం తెలిసిందే. బ్రాండింగ్ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న ఈ సంస్థ.. రజినీకి అంకితం ఇస్తూ ఓ స్పెషల్ ఫ్లైట్ ని డిజైన్ చేసింది. ఆసియాలోనే మొదటిసారిగా ఇలా ఓ సినిమా పోస్టర్ ని ఫ్లైట్ పై వేస్తూ.. బ్రాండ్ ప్రమోషన్ చేయడం ప్రారంభించారు. గతంలో హాలీవుడ్ మూవీ హాబిట్ కి మాత్రమే ఇలా ఫ్లైట్లపై పోస్టర్లు వేసి ప్రచారం నిర్వహించారు.

'ఇది ఒక వ్యక్తి కష్టమే. దీని డిజైనింగ్ కు నెల రోజులకి పైగా సమయం పట్టింది. ఆసియాలోనే ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిది. ఇది సాధారణ ప్రయాణికులు ప్రయాణించే ఎయిర్ క్రాఫ్ట్ అయినా.. కబాలి మూవీతో మా అసోసియేషన్ కారణంగా మరింత ప్రత్యేకంగా మారింది' అంటూ స్పెషల్ ఫ్లైట్ గురించి వివరణ ఇచ్చాయి ఎయిరేషియా వర్గాలు. ఇవాల్టి నుంచి ఈ ఫ్లైట్ బెంగళూరు - న్యూ ఢిల్లీ - గోవా - పూనే - చండీఘడ్ - జైపూర్ - గౌహతి - ఇంఫాల్ - వైజాగ్ - కొచ్చిల మధ్య ప్రయాణం చేయనుంది. సినిమా రిలీజ్ తర్వాత కూడా ఈ ఫ్లైట్ ని ఇలాగే తిప్పనున్నట్లు కంపెనీ చెబుతోంది.

కబాలి మూవీలో రజినీకాంత్ ఫ్లైట్ లో ప్రయాణించే కొన్ని సీన్లు ఉంటాయని.. ఆ సమయంలో ఎయిరేషియా విమానాల్లో ప్రయాణించినట్లుగా చూపనున్నారని తెలుస్తోంది. అలా ఈ బ్రాండ్ ని ఇన్ ఫిలిమ్ ప్రమోట్ చేయనున్నారు. అదీ కబాలి-ఎయిరేషియాల మధ్య అనుబంధం కథ.