పక్కనే బాహుబలి- షాక్ లో ఎయిర్ హోస్టెస్

Thu May 24 2018 17:30:30 GMT+0530 (IST)

మనమంతా పదే పదే చూసి ఇక చాల్లే అని మర్చిపోయాం కానీ బాహుబలి మేనియా ఇంకా చాలా చోట్ల అలాగే ఉంది. అది ఏ స్థాయిలో అంటే ప్రభాస్ గతంలో నటించిన సినిమాలేవీ గుర్తుకు రాక ఒక్క బాహుబలి మాత్రమే మనసులో బలంగా రిజిస్టర్ అయ్యేంత. సాహు కోసం దుబాయ్ లో నెలన్నర రోజులుగా మకాం వేసిన రెబెల్ స్టార్ కఠినమైన యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రంజాన్ పండగ స్టార్ట్ అయ్యింది కాబట్టి అరబ్ దేశాల్లో షూటింగ్ పరంగా చాలా ఆంక్షలు ఉంటాయి. అందుకే ముందే ప్లాన్ చేసి సాహో టీమ్ పక్కగా తన వర్క్ పూర్తి చేసుకుంది. తిరిగి బయలుదేరిన క్రమంలో ఎమిరేట్స్ కు చెందిన ఒక ఫ్లైట్ లో ప్రభాస్ ని చూసిన ఒక ఎయిర్ హోస్టెస్ అతని పక్కనే కూర్చుని సంభ్రమాశ్చర్యాలతో ప్రభాస్ ను చూస్తూ ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.చాలా సహజమైన ఎక్స్ ప్రెషన్స్ తో బాహుబలి నువ్వేనా నేను కూర్చున్నది నీ పక్కనేనా అనేలా షాక్ లో ఉన్న ఆ అమ్మాయి మొహం చూస్తుంటే బాహుబలి ఫాలోయింగ్ ఈ రేంజ్ లో ఉందా అని అనిపించకమానదు. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసినా అభిమానుల మనసులో బాహుబలికి ఉన్న స్థానం చెక్కుచెదరలేనిది అని అర్థమైపోయింది కదా. దేశానికి బాషతో సంబంధం లేకుండా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ చూస్తే ఎవరికైనా ఈర్ష్య పుట్టక మానదు. మేడం టుస్సాడ్ మ్యూజియం మొదలుకుని పుస్తకాల వరకు సర్వం బాహుబలి మయం అయిన ట్రెండ్ లో ఇలా ఎయిర్ హోస్టెస్ షాక్ లో చూడటం పెద్ద ఆశ్చర్యం కాదంటున్న డార్లింగ్ ఫాన్స్ మాట నిజమే అనిపిస్తుంది కదూ