Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఓ మై గాడ్.. అజ్ఞాతవాసి

By:  Tupaki Desk   |   16 Dec 2017 12:06 PM GMT
టీజర్ టాక్: ఓ మై గాడ్.. అజ్ఞాతవాసి
X
కాసేపు ఫారిన్లో నడుస్తాడు. మరోసారి కాశీలో కనిపిస్తాడు. ఇంకోసారి హైదరాబాదులో కొడుతుంటాడు. మరోసారి యురోప్ లో రొమాన్స్ చేస్తుంటాడు. ఇంతకీ అతనెవరు? అతనే ''అజ్ఞాతవాసి''. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి సినిమా తాలూకు టీజర్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాగా త్రివిక్రమ్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూద్దాం పదండి.

భారీ స్టార్ క్యాస్టింగ్.. భారీ సెట్టింగ్.. భారీ లుక్స్.. భారీ ఫీల్.. అన్నీ ఉన్నా కూడా మధ్యలో పవన్ కళ్యాణ్‌ ఎంట్రీ ఇచ్చాడంటే ఆ కిక్కే వేరప్పా. అలా మనోడు లో యాంగిల్ షాటులో నడిచొస్తుంటే.. పైన ఒక ఫైటర్ జెట్ వెళ్ళడం.. ముందు ఒక బైక్ పక్కకు తిరుగుతూ విలన్స్ వెళ్ళి అవతల పడటం.. ఆ షాట్ చాలా బాగుంది. అలాగే హీరోయిన్లతో రొమాన్స్ కూడా 'ఓ మై గాడ్' అంటూ పవన్ ఇరగదీశాడు. కీర్తి సురేష్‌ చాలా లైవ్లీగా ఉంటే.. అనూ ఎమ్మానుయేల్ టూ హాటుగా ఉంది. ఇకపోతే రావు రమేష్‌.. మురళీ శర్మ కాంబినేషన్ ఏదో బాగా వర్కవుట్ అయినట్లు ఉందిలే. అలాగే ఖుష్బూ పాత్రను పరిచయం చేయలేదు కాని.. వెనుక నుండి చూస్తే.. ఆవిడ ఆవిడే అని తెలుస్తోంది.

మొత్తంగా ఈ టీజర్ అంతా మెరుపులతో మెరిసిపోయింది. సినిమాటోగ్రాఫర్ మణికందన్ తాలూకు గ్రాండ్ విజువల్స్.. ఆర్ట్ డైరక్టర్ రవి ప్రకాష్‌ క్రియేట్ చేసిన కలర్ ఫుల్ లుక్.. మొత్తంగా త్రివిక్రమ్ తాలూకు విజువలైజింగ్.. అన్నింటికంటే పైన పవన్ కళ్యాణ్‌.. అదిరిపోయిందంతే. హారికా హాసినా పతాకంలో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాను జనవరి 10న రిలీజవుతోంది.