అజ్ఞాతవాసి ట్రైలర్ ఏమైందబ్బా?

Fri Jan 05 2018 10:28:53 GMT+0530 (IST)

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి.. ఈ నెల 10న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ అంతటా అజ్ఞాతవాసి హంగామా ఫుల్ ప్లెడ్జెడ్ గా ఉంది. మూవీ రిలీజ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే గ్యాప్ ఉన్నా.. ఇప్పటివరకూ థియేట్రికల్ ట్రైలర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషమయే.నిన్నటికి నిన్న సాయంత్రం 6 గంటలు అవుతోందనే సరికి.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా సిస్టమ్స్ ఓపెన్ చేసుకుని.. సోషల్ మీడియా ముందు చేరిపోయారు. ఇందుకు కారణం.. ఆ సమయానికి ట్రైలర్ రిలీజ్ అనే ప్రచారం జరగడమే. ట్రైలర్ రిలీజ్ పై నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ.. ఆ తరహా ప్రచారం జరిగిందంతే. టీజర్ తోనే విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. కొడకా కోటేశ్వరరావా అంటూ పవన్ పాడిన పాటతో.. అంచనాలను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయింది.

ఇక థియేట్రికల్ ట్రైలర్ కూడా వచ్చేస్తే.. అజ్ఞాతవాసి హంగామా మామూలుగా ఉండదు. కానీ ఆ ట్రైలర్ ఎప్పుడొస్తుందో మాత్రం అర్ధం కావడం లేదు. అటు పవన్ కళ్యాణ్ కానీ.. దర్శకుడు త్రివిక్రమ్ కానీ.. నిర్మాతలు కానీ ఈ విషయంపై అసలు నోరు విప్పడం లేదు. అతి తక్కువ ప్రచారం చేసినా.. అత్యధికంగా క్రేజ్ సంపాదించుకున్న సినిమాగా అజ్ఞాతవాసి రికార్డుల్లోకి ఎక్కేట్లుగా ఉంది. ఇంతకీ ఆ థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడు ఇస్తావు అజ్ఞాతవాసీ?