అజ్ఞాతవాసి ఆడియో రైట్స్ కి అంతా

Mon Nov 20 2017 16:25:50 GMT+0530 (IST)

గతంలో ఆడియో రైట్స్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. క్యాసెట్స్.. సీడీల వరకూ ట్రెండ్ ఉన్నంత కాలం వీటి రూపంలో రేట్లు బాగానే గిట్టుబాటు అయ్యేవి. కానీ సోషల్ మీడియా పెరిగిపోయి.. ఇంటర్నెట్ విస్తృతం అయ్యాక.. ఆడియో హక్కుల రూపంలో అంతగా రేట్లు రావడం లేదు. కానీ ఇప్పుడు పవన్ మూవీ అజ్ఞాతవాసి కొత్త రికార్డులు సెట్ చేసేస్తోందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుండగా.. ప్రస్తుతం ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే శాటిలైట్ రైట్స్ పై ఓ క్లారిటీ వచ్చేయగా.. ఇప్పుడు ఆడియో రైట్స్ ను భారీ రేటుకు విక్రయించారట. ఓ టాప్ ఆడియో కంపెనీ ఏకంగా 2 కోట్ల రూపాయలను చెల్లించి పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. ఇది చాలా పెద్ద రికార్డ్ అనాల్సిందే. బాహుబలి సిరీస్ లో ఏ మూవీకి కూడా ఇంత మొత్తం ఆడియో రూపంలో దక్కలేదు.

కానీ పవన్ - త్రివిక్రమ్-అనిరుధ్ రవిచందర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ ఆడియో పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. రీసెంట్ రిలీజ్ అయిన సింగిల్ కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియో మొత్తంగా ఇంకా ట్రెండింగ్ అయిపోతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే ఇంత పెద్ద రికార్డ్ అని చెప్పవచ్చు.