Begin typing your search above and press return to search.

పోయిందంటూనే 2 మిలియన్లు తెచ్చాడు

By:  Tupaki Desk   |   15 Jan 2018 9:54 AM GMT
పోయిందంటూనే 2 మిలియన్లు తెచ్చాడు
X
గత ఐదు రోజులుగా ఒక సినిమా డిజాస్టర్ అవ్వడం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరగడం అజ్ఞాతవాసి విషయంలోనే జరిగింది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వీక్ కంటెంట్ తో ఉన్న మూవీ ని పుష్ చేయటం యూనిట్ వల్ల కాలేదు. వెంకటేష్ సీన్లు జత చేసాక పరిస్థితిలో మార్పు వస్తుందేమో అనుకున్నారు కాని ఐదు నిమిషాల క్యామియో కోసం మళ్ళి టికెట్ కొనే సాహసం అందరూ చేయలేకపోతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. ఏది ఎలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు అజ్ఞాతవాసి. ఆదివారం దాకా పూర్తైన రన్ ని పరిగణనలోకి తీసుకుంటే రెండు మిలియన్ డాలర్ల మార్క్ ని విజయవంతగా పూర్తి చేసుకున్నాడు. పవన్ అల్ టైం హిట్ అత్తారింటికి దారేది ఫుల్ రన్ లో తెచ్చింది 1.89 మిలియన్ డాలర్లు మాత్రమే.

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది మొదటిసారి కాగా త్రివిక్రమ్ లాస్ట్ మూవీ అఆ కూడా 2 మిలియన్ మార్క్ అందుకుంది. దీన్ని బట్టి త్రివిక్రమ్ బ్రాండ్ అక్కడ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. భారీ నెంబర్ స్క్రీన్లలో ప్రీమియర్ షోలు వేయటం దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. పైగా పవన్-త్రివిక్రమ్ కాంబో అనేసరికి మినిమం గ్యారెంటీ ఉంటుంది అనే నమ్మకంతోనే అడ్వాన్స్ బుకింగ్స్ బ్రహ్మాండంగా జరిగాయి. టాక్ తేడాగా వచ్చినప్పటికి ఓసారి చూద్దాం అనుకున్న ప్రేక్షకులు కూడా బాగానే ఉన్నారు అక్కడ. ప్రస్తుతానికి ఎనిమిదో స్థానంలో ఉన్న అజ్ఞాతవాసి మరో వారం లేదా పది రోజులు ఎంత చేస్తాడు అనే దాన్ని బట్టి ప్లేస్ డిసైడ్ అవుతుంది.

ఇప్పటికే టాప్ 2 ప్లేసెస్ బాహుబలి 2, బాహుబలి ఆక్రమించుకోగా మూడు నాలుగు స్థానాల్లో శ్రీమంతుడు, అఆ ఉన్నాయి. ఐదు మెగాస్టార్ ఖైది నెంబర్ 150 తీసుకుంటే ఆరో స్థానం ఫిదా లాగేసుకుంది. ఏడులో జూనియర్ నాన్నకు ప్రేమతో ఉంది.మరో పాతిక వేల డాలర్లు కనక అజ్ఞాతవాసి రాబడితే నాన్నకు ప్రేమతో క్రాస్ చేయొచ్చు. అసాధ్యం కాదు కాని బాగా స్ప్రెడ్ అయిపోయిన టాక్ తో సులభం అయితే కాదు.