Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ః అర్నాల్డ్ ఇలాంటి పాత్రలోనా

By:  Tupaki Desk   |   9 Feb 2017 8:18 AM GMT
ట్రైలర్ టాక్ః అర్నాల్డ్ ఇలాంటి పాత్రలోనా
X
అర్నాల్డ్ స్వార్జనెగర్ అనగానే ఆడియన్స్ కు టెర్మినేటర్ గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. అప్పటి నుంచి దాదాపు యాక్షన్ మూవీస్ లోనే కనిపించాడు అర్నాల్డ్. భారీగా పెంచిన కండలు తిరిగిన శరీరంతో కనిపించడం ఈ యాక్షన్ హీరో స్పెషాలిటీ. 69 సంవత్సరాల వయసులోనూ ఇంతటి ఫిట్నెస్ చూపించడం.. బహుశా మరెవరికీ సాధ్యం కాని విషయమే.

ఇప్పుడు అర్నాల్డ్ కొత్త సినిమాలో రానుంది. ఆఫ్టర్మాత్ (Aftermath) అనే టైటిల్ పై రూపొందిన ఈ చిత్రంలో విభిన్నంగా కనిపించనున్నాడీ యాక్షన్ హీరో. తాజాగా ఆఫ్టర్ మ్యాథ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తన భార్యా బిడ్డల మరణానికి కారణమైన ఓ ఉద్యోగిపై పగ సాధించే పాత్రలో కనిపించనుండగా.. తెల్ల గడ్డంతో వయసు ముదిరిన వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడు అర్నాల్డ్. ఓ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చేసిన పొరపాటు కారణంగా.. ఓ విమానం మరో ఫ్లైట్ ను ఢీ కొట్టిన ప్రమాదంలో.. భార్యాబిడ్డలను పోగొట్టుకుంటాడు అర్నాల్డ్.

విజువల్స్.. మ్యూజిక్.. థీమ్.. అంతా చాలా రిచ్ గా ఉంది. అయితే.. అర్నాల్డ్ స్వార్జనెగర్ గెటప్ ఈ మూవీకి హైలైట్ కానుంది. సెంటిమెంట్ సీన్స్ పండించడంలోనూ.. భార్యాబిడ్డల మరణానికి కారణమైనందుకు కళ్లలో కసి చూపించడంలోను.. అర్నాల్డ్ తనదైన శైలిలోను మెప్పించి ఆశ్చర్యపరిచేశాడు. ఇలాంటి పాత్రలో ఈ మాజీ కాలిఫోర్నియా గవర్నర్ చేయడమా అని అందరూ ఆశ్చరపోతున్నారు.