Begin typing your search above and press return to search.

అసలెక్కడైనా బొమ్మ పడుద్దా?

By:  Tupaki Desk   |   12 Jan 2018 2:13 PM GMT
అసలెక్కడైనా బొమ్మ పడుద్దా?
X
పద్మావత్ చిత్రంపై వచ్చినన్ని భారీ వివాదాలు.. మరే మూవీపైనా రాలేదేమో అనిపించక మానదు. చిత్తోర్ ఘడ్ రాణి పద్మావతిపై తెరకెక్కించిన ఈ చిత్రం.. డిసెంబర్ 1నే విడుదల కావాల్సి ఉన్నా.. రాజ్ పుత్ కర్ణి సేన సహా పలువురి ఆందోళనల కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు పద్మావతి నుంచి పద్మావత్ గా పేరు మార్చుకుని.. సెన్సార్ చెప్పిన కట్స్ కు తలొగ్గి.. చారిత్రక చిత్రం అని కాకుండా.. కల్పితగాధ అనే స్టాంప్ పై ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.

అయితే.. రాజస్థాన్ లో ఈ మూవీ రిలీజ్ ను నిషేధిస్తున్నట్లు గతంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రకటించారు. ఆ తర్వాత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కూడా ఇదే బాట పట్టారు. తాము సినిమాకు వ్యతిరేకం కాదని.. కానీ లా అండ్ ఆర్డర్ ను దృష్టిలో ఉంచుకుని గోవాలో ఈ చిత్ర ప్రదర్శనకు అంగీకరించడం లేదని చెప్పారు మనోహర్ పారిక్కర్. ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా పద్మావత్ పై ఇదే తరహా నిర్ణయం తీసుకుని.. గుజరాత్ లో ఈ సినిమా రిలీజ్ కావడం లేదని తేల్చేశారు.

రాజస్థాన్.. గుజరాత్.. గోవా.. ఇలా వరుసగా ఈ సినిమాపై నిషేధం విధించడం చూస్తుంటే.. అసలు ఈ సినిమా ఈ మాత్రానికి విడుదల అయ్యి ఉపయోగమేంటి అనిపించక మానదు. ఇతర ప్రాంతాలలో రిలీజ్ చేసినా.. అక్కడి పరిస్థితులను బేస్ చేసుకుని.. ఆ తర్వాత బ్యాన్ చేస్తే ఏంటి పరిస్థితి అనిపించక మానదు.

కొన్నేళ్ల క్రితం డావిన్సీ కోడ్ అనే మూవీ విషయంలో ఇలాగే కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేస్తే.. ఆ డబ్బింగ్ చేసిన ప్రొడ్యూసర్లు కోర్టులో కేసు వేసి సినిమా రిలీజ్ కు అనుమతులు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు పద్మావత్ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం.