అఖిల్ కోసం ట్రయాంగిల్ వార్

Mon Feb 18 2019 14:08:26 GMT+0530 (IST)

టాలీవుడ్ లోనే అతి పెద్ద స్టార్ బ్యాక్ గ్రౌండ్ కుటుంబాల్లో ఒకటి. నాన్న నలుగురు సీనియర్ అగ్ర హీరోల్లో ఒకరు. అమ్మ మాజీ నటి. అన్నయ్య వచ్చి ఆల్రెడీ తోమిదేళ్ళు దాటేసింది. అన్ని వైపులా పరిశ్రమతో లింక్ ఉన్న బందాలే. అయినా కూడా అక్కినేని అఖిల్ కు సక్సెస్ అందని ద్రాక్షే అయ్యింది. మూడేళ్ళలో ఆచి తూచి మూడే సినిమాలు చేసినా ఏదీ కనీసం యావరేజ్ కూడా కాకపోవడం అభిమనులకు సైతం కలవరం కలిగించింది.గతంలో కాకుండా ఈసారి కథలను దర్శకులను ఎంచుకునే విషయంలో కాస్త స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నట్టు గతంలోనే టాక్ వచ్చింది. అయినా కూడా కొంత అయోమయం తప్పేలా లేదు. అఖిల్ నాలుగో సినిమా కోసం మొత్తం ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి

మొదటిది బొమ్మరిల్లు భాస్కర్. దిల్ రాజు బ్యానర్ కు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడిగా భాస్కర్ డిమాండ్ అప్పట్లో ఓ రేంజ్ లో ఉండేది. పరుగు పాసైపోయినా ఆరంజ్-ఒంగోలు గిత్త అతన్ని పూర్తిగా ట్రాక్ తప్పించేశాయి. అఖిల్ కోసం భాస్కర్ ఓ లైన్ రెడీ చేసాడని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఇది తీయించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ ఉంది

ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ ఇంతకు ముందే లైన్ చెప్పి ఓకే చేయించుకుని స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడని మిస్టర్ మజ్ను టైంలోనే వార్త వచ్చింది. వీళ్ళు కాకుండా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ కూడా రేస్ లో ఉన్నాడట. గీత 2 బ్యానర్లో అఖిల్ కోసమే అల్లు అరవింద్ బ్లాక్ చేసుకున్నారని టాక్. ఫైనల్ గా అఖిల్ ఎవరితో చేయబోతున్నాడు అనే సస్పెన్స్ ఇంకొన్నాళ్ళు కొనసాగేలా ఉంది